Vaishnav Tej: ‘రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు’.. మాస్ లుక్లో అదరగొట్టిన వైష్ణవ్..
ప్రస్తుతం వైష్ణవ్ రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి..
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేశాడు వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడమే కాకుండా.. ఇండస్ట్రీలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండాపొలం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం వైష్ణవ్ రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమాలో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్త సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూస్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో వైష్ణవ్ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. బుధవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ చిత్రానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు..
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి వైష్ణవ్ పోషించబోయే పాత్ర ఇంటెన్సిటినీ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. “రేయ్.. రాముడు లంక మీద పడింది వినుంటావు.. అదే పది తలల రావణుడు అయోధ్య మీద పడితే ఎట్టుంటుందో చూస్తావా ? అంటూ ప్రతినాయకుడు పలికితే.. ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప.. ఆ రావణుడే కొలిచే రుద్ర కాళేశ్వరుడు..తలలు కోసి చేతికిస్తా నాయాలా.. చూసుకుందాం.. రా !!” అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లుగా గ్లింప్స్ తోనే తెలియజేశారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది.
ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు!?#PanjaVaisshnavTej in a raw & stupendous massy role! Coming this Sankranthi 2023?
▶️https://t.co/47B5gyEtIO#PVT04 shoot begins soon ⚡ #Sreeleela #SrikanthNReddy @vamsi84 #SaiSoujanya pic.twitter.com/fTsTbU2PBZ
— BA Raju’s Team (@baraju_SuperHit) June 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.