AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: సితారే జమీన్ పర్ ఖాతాలో వందకోట్లు.. గాజా బాధితులకు అమీర్ ఖాన్ భారీ విరాళం.. అసలు నిజమిదే..

ప్రయోగాత్మక చిత్రాలు, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరో ఆమీర్ ఖాన్. దశాబ్దాలుగా సినీరంగంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేశారు. ఇక ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Fact Check: సితారే జమీన్ పర్ ఖాతాలో వందకోట్లు.. గాజా బాధితులకు అమీర్ ఖాన్ భారీ విరాళం.. అసలు నిజమిదే..
Sitare Zameen Per
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2025 | 1:59 PM

Share

బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ సితారే జమీన్ పర్. 2007లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించారు. ఇందులో జెనీలియా కథానాయికగా నటించింది. 2018లో వచ్చిన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు హిట్ టాక్ వస్తుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.105.17 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక నెమ్మదిగా ఈ మూవీ వసూళ్లు పుంజుకుంటున్నాయి. నాలుగు రోజుల్లో భారత్ లో రూ.65 కోట్లకు పైగా వసూల్లు రాబట్టగా.. గ్రాస్ రూ.78 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమా వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టడంతో చిత్రయూనిట్ సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆమీర్ ఖాన్ నటించిన వంద కోట్లు దాటిన చిత్రాలలో ఇది 11వ చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఎనిమిదవ రోజు (శుక్రవారం) రూ.6.5 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తం భారత్ లో రూ.94.4 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇక శనివారం, ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆదాయంలో 50 శాతం గాజా బాధితులకు ఆమీర్ ఖాన్ విరాళం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఆమీర్ ఖాన్ ప్రకటించినట్లు ఓ గ్రాఫిక్ పోస్టర్ సైతం తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఆమీర్ ఖాన్ ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదని న్యూస్ 24 వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ పై న్యూస్ 24 లోగో కనిపిస్తుంది. దీంతో కొందరు నెటిజన్స్ ఆమీర్ సినిమాను బ్యాన్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విశ్వాస్ న్యూస్ ప్రకారం.. తన సినిమా ఆదాయంలో 50 శాతం విరాళం ఇస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని తేలింది. గతంలో షారుఖ్ నటించిన జవాన్, పఠాన్ సినిమాల గురించి తప్పుదారి పట్టించే ఫేక్ పోస్టులు నెట్టింట వైరల్ అయినట్లు గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు