AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Darshan: మరో కేసులో నిందితుడిగా హీరో దర్శన్.. ఈసారి భార్యను కూడా ఇరికేంచేశాడుగా!

రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప రెండో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు . నటి, దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ మొదటి నిందితురాలు. దర్శన్ ను కాపాడేందుకు అతని భార్య విజయలక్ష్మి అన్ని ప్రయత్నాలుచేస్తోంది. లాయర్‌ని నియమించి దర్శన్‌ను విడుదల చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది.

Hero Darshan: మరో కేసులో నిందితుడిగా హీరో దర్శన్.. ఈసారి భార్యను కూడా ఇరికేంచేశాడుగా!
Hero Darshan
Basha Shek
|

Updated on: Jun 19, 2024 | 11:14 AM

Share

రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప రెండో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు . నటి, దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ మొదటి నిందితురాలు. దర్శన్ ను కాపాడేందుకు అతని భార్య విజయలక్ష్మి అన్ని ప్రయత్నాలుచేస్తోంది. లాయర్‌ని నియమించి దర్శన్‌ను విడుదల చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆమె పలువురు న్యాయవాదులను కలుస్తోంది. ఇంతలో విజయలక్ష్మికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయలక్ష్మిని ఒక కేసులో ఏ1 నిందితురాలిగా చేర్చారు పోలీసులు. ఇప్పుడు చార్జిషీటును కూడా సమర్పించనున్నారు. గతేడాది జనవరిలో మైసూర్‌లోని దర్శన్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి దర్శన్ అక్రమంగా ఉంచిన బార్ హెడ్డ్ గూస్ ( మంగోలియా జాతికి చెందిన లేత బూడిద రంగు పక్షులు) పక్షులను స్వాధీనం చేసుకున్నారు. ఈ పక్షులను దాచి ఉంచడం చట్ట రీత్యా నేరం. దీంతో పక్షులను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ దర్శన్‌పై కేసు నమోదు చేసింది. విజయలక్ష్మి దర్శన్, మేనేజర్ నాగరాజు, మైసూర్ ఫామ్ హౌస్ యజమాని దర్శన్‌లపై అక్రమంగా పక్షుల పెంపకంపై కేసు నమోదు చేసి విచారణకు పిలిచారు. ఈ కేసులో విజయలక్ష్మి ఏ1, నాగరాజు ఏ2, దర్శన్ ఏ3 ఉన్నారు. కానీ ఎవరూ విచారణకు రాలేదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కోర్టుకు చార్జిషీటు సమర్పించేందుకు అటవీశాఖ సిబ్బంది సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఓ హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్.. ఇప్పుడు అటవీ శాఖ కేసు కూడా నమోదు కావడంతో హీరో పరిస్థితి మరింత కష్టంగా మారనుంది. ఈ కేసులో విజయలక్ష్మి ఏ1గా ఉండడంతో ఆమె కూడా విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ జైలుకు వెళ్లగా, పవిత్ర గౌడ ఏ 1 నిందితురాలిగా ఉంది .  ఈ కేసులో హీరో దర్శన్ ఏ2 గా ఉన్నాడు . ప్రధాన నిందితులంతా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నేరస్తులను శిక్షించాలని, రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అదే సమయంలో హీరో దర్శన్ కు అనుకూలంగా కూడా ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్‌గా పనిచేసిన శ్రీధర్ ఏప్రిల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆత్మహత్య కేసును మళ్లీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.