AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన సమస్యతో బాధపడుతున్న అనుష్క.. షూటింగ్‌లో చాలా ఇబ్బందిపడ్డనంటున్న నటి

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అందాల భామ. సూపర్ సినిమాలో అనుష్క అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణించింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. అలాగే లేడీ ఓరియేంటేడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు.

అరుదైన సమస్యతో బాధపడుతున్న అనుష్క.. షూటింగ్‌లో చాలా ఇబ్బందిపడ్డనంటున్న నటి
Anushka
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2024 | 10:39 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క ఒకరు. ఈ చిన్నది టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఏలింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అందాల భామ. సూపర్ సినిమాలో అనుష్క అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణించింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. అలాగే లేడీ ఓరియేంటేడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. ఆమె నటించిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు అనుష్క సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి సినిమాలో నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే అనుష్కకు ఉన్న ఓ అరుదైన సమస్య తో బాధపడుతుంది. అది పెద్ద సమస్య కాదు.. కానీ దాని వల్ల అనుష్క కొన్ని సార్లు ఇబ్బందిపడిందట. ఇదే విషయాన్నీ ఆమె పలుసార్లు ఇంటర్వ్యూలో తెలిపింది. ఒక్కసారి నవ్వితే అనుష్క చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట. ఎవరైనా జోక్ చేస్తే చాలు పగలబడి నవ్వుతుందట ఈ అమ్మడు. దాని వల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను అని తెలిపింది అనుష్క.

అనుష్క శెట్టి చాలా త్వరగా నవ్వేస్తుందట..చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుంది. ఒక్కసారి నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేదు. అనుష్క శెట్టి ఎంత ప్రయత్నించినా నవ్వు ఆపుకోలేక ఒక్కోసారి నేలపై పడి నవ్వుకుంటుందట. ఈ కారణంగా చాలాసార్లు షూటింగ్ ఆగిపోయిందని తెలిపింది. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు షూటింగ్ చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారు అని తెలిపింది అనుష్క. వారు టీ తాగి రిలాక్స్ అయ్యే వరకు తాను నవ్వుతూనే ఉంటాను అని సరదాగా తెలిపింది అనుష్క.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..