AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayakanth: కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రునయనాల మధ్య ముగిసిన విజయ్ కాంత్ అంత్యక్రియలు

విజయ్ కాంత్ మరణంతో కోలీవుడ్ విషాదం లో నిండిపోయింది.  విజయ్ కాంత్ అంతిమయాత్రకు భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. అశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు మధ్య అంతిమయాత్ర జరిగింది. విజయ్ కాంత్ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

Vijayakanth: కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రునయనాల మధ్య ముగిసిన విజయ్ కాంత్ అంత్యక్రియలు
Vijaykanth
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2023 | 8:29 PM

Share

విజయ్ కాంత్ అంత్యక్రియలు పూర్తయ్యి. కెప్టెన్ కన్నీటి వీడ్కోలు పలికారు కోలీవుడ్ ఆడియన్స్. గతకొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్న విజయ్ కాంత్ నిన్న కన్నుమూశారు. విజయ్ కాంత్ మరణంతో కోలీవుడ్ విషాదం లో నిండిపోయింది.  విజయ్ కాంత్ అంతిమయాత్రకు భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. అశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు మధ్య అంతిమయాత్ర జరిగింది. విజయ్ కాంత్ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో విజయ్‌కాంత్‌. కమల్‌, రజనీ పోటాపోటీగా నటిస్తున్న సమయంలో, తనకంటూ సొంత మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నాడు విజయ్ కాంత్. ప్రత్యేకమైన మాడ్యులేషన్‌తో, డైలాగ్‌ డెలివరీతో, ఎర్రటి కళ్లతో పోస్టర్‌తోనే ఆకట్టుకునేవారు కెప్టెన్‌.

చిన్న నిర్మాతలకు వసూలు చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ కాంత్. 1984లో ఏకంగా 18 సినిమాల్లో నటించిన ఘనత ఆయనది. ఈ రికార్డు సాధించిన హీరోలు తక్కువే అని చెప్పాలి. విజయ్‌కాంత్‌ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. సినిమాల కోసం విజయ్‌కాంత్‌గా పేరు మార్చుకున్నారు. మదురై తెలుగు బాగా మాట్లాడేవారు విజయ్‌ కాంత్‌. ఆయనకు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులున్నారు. 2018లో నటించిన మధురవీరన్‌ ఆయనకు ఆఖరి సినిమా. తమిళనాడు రూరల్‌లో అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న హీరో విజయ్‌కాంత్‌. కెప్టెన్‌ ప్రభాకరన్‌ సినిమా తర్వాత అందరితో కెప్టెన్‌గా పిలిపించుకున్నారు విజయ్ కాంత్. ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు విజయ్‌కాంత్‌. ఆర్‌.కె.సెల్వమణి, మన్సూర్‌ అలీఖాన్‌, వడివేలు, అరుణ్‌పాండ్యన్‌, ఆనంద్‌ రాజ్‌.. ఇలా ఎంతో మందిని ప్రోత్సహించారు.నడిగర్‌ సంగం అప్పుల్లో ఉన్నప్పుడు కోలీవుడ్‌ నటీనటుల్ని ఫారిన్‌కి తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పించి, ఫండ్స్ తెచ్చి, అప్పుల నుంచి బయటపడేసిన ఆలోచన కెప్టెన్‌ది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి