Malaika Arora: ఎట్టకేలకు పెళ్లి పై నోరువిప్పిన మలైకా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన హాట్ బ్యూటీ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా తన రెండో పెళ్లి గురించి పెద్ద ప్రకటన చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో మలైకా రెండో పెళ్లికి సిద్ధమైందని అంటున్నారు. ప్రస్తుతం మలైకా 'ఝలక్ దిఖ్లా జా సీజన్ 11'కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో ఫరా ఖాన్ పెళ్లి గురించి మలైకాను అడిగింది. 'సింగిల్ పేరెంట్ నుంచి డబుల్ పేరెంట్ గా మారుతున్నారా?' అని మలైకా ప్రశ్నించింది. నేను ఒకరిని దత్తత తీసుకోవాలి' అని మలైకా చెప్పింది.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా వివాహం జరిగి చాలా సంవత్సరాలైంది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇది మూడో పెళ్లి. అర్బాజ్ ఖాన్ కారణంగా ఇప్పుడు మలైకా కూడా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా తన రెండో పెళ్లి గురించి పెద్ద ప్రకటన చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో మలైకా రెండో పెళ్లికి సిద్ధమైందని అంటున్నారు. ప్రస్తుతం మలైకా ‘ఝలక్ దిఖ్లా జా సీజన్ 11’కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో ఫరా ఖాన్ పెళ్లి గురించి మలైకాను అడిగింది. ‘సింగిల్ పేరెంట్ నుంచి డబుల్ పేరెంట్ గా మారుతున్నారా?’ అని మలైకా ప్రశ్నించింది. నేను ఒకరిని దత్తత తీసుకోవాలి’ అని మలైకా చెప్పింది.
‘మళ్లీ పెళ్లి చేసుకుంటావా.? అని తిరిగి ప్రశ్నించింది ఫరా ప్రశ్నించింది. దీనికి మలైకా సూటిగా సమాధానం ఇచ్చింది. ‘ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరైనా నా దగ్గరకు వచ్చి పెళ్లి ప్రపోజ్ చేయాలి’ అని తెలిపింది. ఆమె ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది. నటుడు అర్బాజ్ ఖాన్‌తో విభేదించి 2017లో మలైకా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మలైకా జీవితంలోకి అర్జున్ కపూర్ ఎంటర్ అయ్యాడు. అర్జున్, మలైకా చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అంతే కాదు వారిద్దరూ అందరి ముందు తమ బంధాన్ని అంగీకరించారు. ఇంతకుముందు మలైకా , అర్జున్ వయస్సు గ్యాప్ కారణంగా ట్రోల్స్ బారిన పడ్డారు.
మలైకా ఎప్పుడూ ఏదో న్యూస్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మలైకా ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. మలైకా, అర్జున్ కపూర్‌లను పెళ్లి గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి గురించి ఓపెన్‌గా మాట్లాడింది మలైకా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




