AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varisu Trailer Talk: వాటే రెస్పాన్స్ బాసూ.. వరిసు ట్రైలర్‏కు యూట్యూబ్ షేక్.. విజయ్ మేనియా మాములుగా ఉండదు మరీ..

తలైవ, రంజితమే పాటలలో విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అవుట్ స్టాండింగా గా వున్నాయి. విడుదలైన 13 గంటల్లోనే ఏకంగా సుమారు 20 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. దీంతో నెట్టింట విజయ్ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.

Varisu Trailer Talk: వాటే రెస్పాన్స్ బాసూ.. వరిసు ట్రైలర్‏కు యూట్యూబ్ షేక్.. విజయ్ మేనియా మాములుగా ఉండదు మరీ..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2023 | 10:14 AM

Share

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల భారీ అంచనాల చిత్రం వారసుడు/వరిసు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో దళపతి సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ ని బుధవారం విడుదల చేశారు. దీనికి మాసివ్ రెస్పాన్స్ వస్తోంది.

”ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా” అని జయసుధ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ .. ఆద్యంతం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనుభూతిని ఇచ్చింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో పండక్కి విందు భోజనం లాంటి సినిమా వారసుడు అనే నమ్మకానన్ని ఇచ్చింది ట్రైలర్. విజయ్ ఎంట్రీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. తలైవ, రంజితమే పాటలలో విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అవుట్ స్టాండింగా గా వున్నాయి. విడుదలైన 13 గంటల్లోనే ఏకంగా సుమారు 20 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. దీంతో నెట్టింట విజయ్ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

ఇందులో విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ, బ్రదర్స్ గా శ్రీకాంత్, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో నిష్ణాతుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా ‘వారసుడు’ని రూపొందించారు. అద్భుతమైన రైటింగ్, తన స్టైలిష్, ఫెర్పెక్ట్ టేకింగ్‌తో కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచారు వంశీ పైడిపల్లి. విజయ్‌ని గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేశారు. ట్రైలర్ కు ఎస్ థమన్ ఎక్స్ టార్డినరీ నేపధ్య సంగీతం అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, డ్యాన్స్ నెంబర్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్రతి మూడ్ ని అద్భుతంగా ఎలివేట్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.