Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో మళ్లీ నటించేందుకు వెయిటింగ్.. కానీ.. రష్మిక ఆసక్తికర కామెంట్స్..
సంక్రాంతికి వరిసు మూవీతో సందడి చేయనుంది రష్మిక. తమిళ్ స్టార్ విజయ్.. రష్మిక కలిసి నటించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో న్యూఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చింది రష్మిక. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనస్టైల్లో ఆన్సర్స్ ఇచ్చింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల గుడ్ బై సినిమాతో అలరించిన ఈ చిన్నది.. ఇప్పుడు సంక్రాంతికి వరిసు మూవీతో సందడి చేయనుంది. తమిళ్ స్టార్ విజయ్.. రష్మిక కలిసి నటించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో న్యూఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చింది రష్మిక. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనస్టైల్లో ఆన్సర్స్ ఇచ్చింది. ఇందులో ఓ అభిమాని.. మీరు విజయ్ దేవరకొండతో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడగ్గా.. “ప్రస్తుతం నేను బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ షెడ్యూల్ తో ఉన్నాను. ప్రస్తుతం విజయ్ తో కలిసి పనిచేసే ప్లాన్స్ ఏమీ లేవు. అభిమానులు దేవరకొండతో కలిసి మరోసారి నటించాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. కానీ వచ్చే ఏడాది.. లేదంటే ఆ తర్వాత మేము కలిసి నటించే ఛాన్స్ ఉండొచ్చు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ వైరలవుతున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇద్దరి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది. ఆ తర్వాత రెండోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. వీరి పెయిర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రీల్ లైఫ్ లో కాకుండా..రియల్ లైఫ్ లోనూ వీరు ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరు కలిసి మాల్దీవ్స్ వేకేషన్ వెళ్లారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇక ఇటీవల కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ.. విజయ్ షేర్ చేసిన పిక్ తో మరోసారి వీరి రిలేషన్ షిప్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తమ గురించి వస్తున్న రూమర్స్ పట్ల విజయ్, రష్మిక ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం విజయ్.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత, కృతి శెట్టి నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.