AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ స్టోరీ లీక్ చేసిన విజయ్ సేతుపతి.. #RC16 గురించి ఏం చెప్పారంటే..

ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా మహారాజా మూవీ టీంను డైరెక్టర్ బుచ్చిబాబు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా బుచ్చిబాబు నెక్ట్స్ చేయబోతున్న #RC16పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మక్కల్ సెల్వన్. గతంలో బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Vijay Sethupathi: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ స్టోరీ లీక్ చేసిన విజయ్ సేతుపతి.. #RC16 గురించి ఏం చెప్పారంటే..
Vijay Sethupathi, Buchi Bab
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2024 | 7:01 AM

Share

తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‎గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తుంది. అటు తమిళం.. ఇటు తెలుగులో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో మహారాజా మూవీ సక్సెస్ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా మహారాజా మూవీ టీంను డైరెక్టర్ బుచ్చిబాబు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా బుచ్చిబాబు నెక్ట్స్ చేయబోతున్న #RC16పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మక్కల్ సెల్వన్. గతంలో బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఇంటర్వ్యూకు వచ్చిన విజయ్ సేతుపతి కాళ్లకు నమస్కరించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అనంతరం మహారాజా సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇంటర్వ్యూ చివర్లో బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన #RC16 సినిమా మంచి విజయం సాధించాలని విజయ్ సేతుపతి కోరారు. “బుచ్చి.. నువ్వు తీయబోతున్న రామ్ చరణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్. నీకు తెలుసు కదా.. #RC16 స్టోరీ నాకు చెప్పావు. ఆ విషయం చెప్పొచ్చు కదా.. నాకు ఆ సినిమా స్టోరీ తెలుసు. అది చాలా సూపర్ కథ. ఆ ధీమాతోనే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం పక్కా. ఆ స్టోరీ నువ్వు రాసిన విధానం అద్భుతం” అంటూ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. దీంతో #RC16 మరిన్ని అంచనాలు పెరిగాయి.

విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఉప్పెన సినిమాతోనే దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారు. ఇప్పుడు వజియ్ సేతుపతి చెప్పిన మాటలతో ఈసారి మరో హిట్ రావడం ఖాయమని తెలియడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే విజయ్ సేతుపతి లాంటి నటుడు ఇప్పుడు చరణ్ సినిమా సూపర్ హిట్ అని చెప్పడం విని పొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.