AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy 69: విజయ్ 69కు ఆసక్తికర టైటిల్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే

విజయ్ 68వ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు. చాలా కాలంగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న విజయ్ ఈ సినిమాలో కామెడీ, ప్రేమ, డ్యాన్స్, ఎమోషన్, డైలాగ్ డెలివరీలో మాస్ చూపించాడు.

Thalapathy 69: విజయ్ 69కు ఆసక్తికర టైటిల్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే
Thalapathy Vijay
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2025 | 12:19 PM

Share

దళపతి విజయ్ అంటే దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ విజయ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. విజయ్ చివరి చిత్రం దళపతి 69 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే టైటిల్ కు సంబంధించిన కొన్ని రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.  విజయ్ సినిమా పేరు ‘నాలయ్య తీర్పు’ అని కొన్ని వార్తలు వచ్చాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ పద్దెనిమిదేళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాడు. విజయ్ నాన్నగారు తీసిన ‘నాలయ్య తీర్ప్’ సినిమా ద్వారా విజయ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు విజయ్ లాస్ట్ మూవీకి కూడా అదే పేరు పెట్టనున్నట్లు సమాచారం. 1992లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా విజయ్ దళపతి 69 పేరు ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా, హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26న విడుదల చేయనున్నట్లు సమాచారం.

దళపతి 69 ఈ స్టార్ మోస్ట్ హిట్ సినిమాగా నిలిచి 1000 కోట్లు రాబట్టగలదని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని రకాల ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందిందని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా అలానే ఉందని సమాచారం. అయితే దళపతి 69 విజయ్ రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం అవుతుందా.? అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. 

ఈ మూవీ  చిత్రీకరణ ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. విజయ్  దళపతి 69 పెద్ద కాన్వాస్‌పై పాట సన్నివేశంతో ప్రారంభమైంది. ఈ సినిమాలో మమితా బైజు కూడా నటిస్తోంది. అలాగే పూజా హెగ్డే  లీడ్ రోల్ లో నటిస్తుంది. మలయాళం నుంచి నరేన్, ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇతర నటీనటులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,  ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని టాక్. అక్టోబర్‌లో సినిమా థియేటర్లలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..