AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసింది ఆమె.. ఈ పాలబుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా.?

తెలుగులో సినిమాలు చేసింది తక్కువే.. కానీ అన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అటు హిందీ.. ఇటు తెలుగు భాషలతో పాటు తమిళం, మలయాళం భాషల్లో తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కుర్రాళ్ళకు ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసింది ఆమె.. ఈ పాలబుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2025 | 12:41 PM

Share

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అర్రే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా.. ఆమె మరోసినిమాలో కనిపించడం లేదు. కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇంతకూ పై ఫొటోలో బూరె బగ్గులతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తన హాట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ చారెడేసి కళ్ళ చిన్నారికి ఏకంగా గుడి కూడా కట్టారు ఫ్యాన్స్.. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. ఆ బూరెబుగ్గల పాప.. మరెవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నమిత. సొంతం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. నమిత అసలు పేరు.. నమిత వాంక్వాలా. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జన్మించిన ఈ బ్యూటీ.. 1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సొంతం చేసుకుంది.

సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తెలుగు యువకుడిని పెళ్లాడింది నమిత.. ఇక ఈ చిన్నది బిల్లా, సింహ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. బిల్లా సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసింది నమిత. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మిచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!