Rashmika-Vijay: కోడలిగా రష్మిక మందన్నాకు ఒకే ఒక్క కండిషన్ పెట్టిన విజయ్ దేవరకొండ పేరెంట్స్.. వీడియో ఇదిగో

టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు తమ పెళ్లిని అధికారికంగా ధ్రువీకరించారు. ఇప్పటి దాకా వచ్చిన అన్ని రూమర్లను నిజం చేస్తూ ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో తాము పెళ్లి పీటలెక్కనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

Rashmika-Vijay: కోడలిగా రష్మిక మందన్నాకు ఒకే ఒక్క కండిషన్ పెట్టిన విజయ్ దేవరకొండ పేరెంట్స్.. వీడియో ఇదిగో
Vijay Deverakonda, Rashmika

Updated on: Feb 23, 2026 | 9:19 PM

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నాట్లు తెలుస్తోంది. అయితే సినీ, రాజకీయ ఇతర ప్రముఖుల కోసం మార్చ్ 04న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి పై సైలెంట్ గా ఉన్న విజయ్, రష్మిక ఎట్టకేలకు ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి తమ గ్రాండ్ వెడ్డింగ్ పై అధికారిక ప్రకటన విడుదల చేశారు. అభిమానుల కోరిక మేరకు తమ పెళ్లి వేడుకకు ‘విరోష్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మొత్తానికి టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒక్కటి కానుండడంతో వీరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు విజయ్, రష్మికల పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ వారికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పేరెంట్స్ తమకు కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

విజయ్ నటించిన ఒక సినిమా సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ.. విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ అతని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. మీకు ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నారు అని విజయ్ తల్లి మాధవిని సుమ అడిగినప్పుడు.. ఆమె తనకు ఒకే ఒక కండిషన్ ఉందని చెబుతుంది. ‘మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. ఆమె అతన్ని బేషరతుగా ప్రేమించాలి అంతే. మా అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, ఆమె అతన్ని బాగా అర్థం చేసుకోవాలి’ అని మాధవి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా మాట్లాడుతూ.. “తనకు నచ్చిన అమ్మాయినే అతను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, అంచనాలు లేవు. అలాగే నాకు కులం, మతం వంటి పట్టింపులు కూడా లేవు. అతను ఒక భారతీయురాలిని, ముఖ్యంగా ఒక దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ తల్లిదండ్రులు కోరుకున్నట్లు గానే రష్మిక రూపంలో తమ హీరోను బాగా చూసుకునే అమ్మాయే వచ్చిందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us