Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ అభిమానులను ఖుషి చేస్తాడా.? ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు
డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా విజయ్ కు హిట్ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా ఖుషి.
మా హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ కావలి.. ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోరుకునేది ఇదే.. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా విజయ్ కు హిట్ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా ఖుషి. టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మొన్నామధ్య ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు. ఖుషి సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తోన్న విషయం తెలిసిందే.
మొన్నామధ్య సమంత అనారోగ్యానికి గురికావడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది ఈ సినిమా ఈ సినిమా పై గట్టి నమ్మకంతో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. మరోసారి విజయ్ లవ్ స్టోరీతో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరి ఖుషి సినిమాతో ఫ్యాన్స్ ను ఈ రౌడీ హీరో ఖుషి చేస్తాడేమో చూడాలి.