Kingdom Collections Day 2: కింగ్‏డమ్ కలెక్షన్స్.. రెండో రోజు బాక్సాఫీస్‏ను కుమ్మేసిన విజయ్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన సినిమా కింగ్డమ్. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ వహించిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. జూలై 31న విడుదలైన ఈ చిత్రానికి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెండు రోజుల కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Kingdom Collections Day 2: కింగ్‏డమ్ కలెక్షన్స్.. రెండో రోజు బాక్సాఫీస్‏ను కుమ్మేసిన విజయ్..
Kingdom

Updated on: Aug 02, 2025 | 2:20 PM

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేశ్ కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ మూవీ అటు కలెక్షన్లలో దుమ్మరేపుతుంది.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..

ఇవి కూడా చదవండి

తొలిరోజే వరల్డ్ వైడ్ రూ.39 కోట్లు కలెక్ట్ చేసిన్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాకు రెండు రోజుల్లో మొత్తం రూ.53 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు దూసుకుపోతుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న విజయ్.. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..