Vijay Devarakonda: సోషల్ మీడియాలో పేరు మార్చిన విజయ్ దేవరకొండ.. షాక్లో అభిమానులు..
Vijay Devarakonda: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తమ అభిమాన నటీనటుల గురించి తెలుసుకోవడం..

Vijay Devarakonda: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తమ అభిమాన నటీనటుల గురించి తెలుసుకోవడం.. వారిని ఫాలో అవుతూ.. సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తమ అభిమాన హీరోహీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలపై ఓ కన్నేసి పెడతారు. అయితే ఇటీవల స్టార్ హీరోహీరోయిన్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పేరు మారుస్తున్నారు. అయితే నార్మల్గా పేరు మారిస్తే పర్లేదు… కానీ ఆ తర్వాతే అసలు విషయాలను బయటపెడుతున్నారు.
గతంలో సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో అక్కినేని అనే పదాన్ని తొలగించడంతో సామ్, చైతూ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి అని.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. చివరకు ఆ అనుమానాలే నిజమయ్యాయి. ఇక ఇటీవల ప్రియాంక చోప్రా.. చిరంజీవి తనయ శ్రీజ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలలో పేర్లు మార్చడంతో నెట్టింట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేరు మార్చుకున్నాడు. దీంతో రౌడీ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన తుఫాన్ అనే పదాన్ని యాడ్ చేశాడు. ఇంకేముంది నెటిజన్లు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మాత్తుగా విజయ్ ఇలా పేరు మార్చడమేంటని.. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. అయితే ఇటీవల సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓ ఫోజ్కు తుఫాన్ అనే ట్యాగ్ కనిపించింది. ఇక ఇదే విజయ్ పేరు మార్చడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. విజయ్.. యాడ్స్ చేయడంలో ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం ఏకంగా తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చి మరింత స్పెషల్ అనిపించుకున్నాడు విజయ్.
ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
Dedicating this beautiful song to all our Mothers ? nothing in the world like them.
Love the lyrical video and this team.. Sending all my love to Team #OkeOkaJeevitham.. This movie will be special!https://t.co/gMIJClKx5g
— Vijay Deverakonda TOOFAN (@TheDeverakonda) January 26, 2022
Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..
Actor Photo: ఈ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తుపట్టారా ?.. అమ్మాయిల ఫెవరెట్ హీరో..





