AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: బాలీవుడ్‌లో హవా కొనసాగిస్తోన్న ‘రౌడీ బాయ్’‌… విజయ్‌తో జతకట్టనున్న మరో బాలీవుడ్‌ బ్యూటీ..?

Vijay Devarakonda : ఏ క్షణాన విజయ్‌ దేవరకొండ 'అర్జున్‌ రెడ్డి' సినిమాలో నటించాడో కానీ ఆయన క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న విజయ్‌ ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారాడు. పెళ్లి చూపులతో..

Vijay Devarakonda: బాలీవుడ్‌లో హవా కొనసాగిస్తోన్న 'రౌడీ బాయ్'‌... విజయ్‌తో జతకట్టనున్న మరో బాలీవుడ్‌ బ్యూటీ..?
Vijay Next Movie
Narender Vaitla
|

Updated on: Mar 13, 2021 | 4:29 PM

Share

Vijay Devarakonda : ఏ క్షణాన విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో నటించాడో కానీ ఆయన క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న విజయ్‌ ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారాడు. పెళ్లి చూపులతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించిన విజయ్‌.. అర్జున్‌ రెడ్డితో యూత్‌లో ఫుల్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. దీంతో విజయ్‌ పేరు బాలీవుడ్‌లోనూ మారుమోగింది. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంలోనే దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ ‘రౌడీ’ హీరోతో ‘లైగర్‌’ అనే పాన్‌ ఇండియా మూవీని ప్లాన్‌ చేస్తున్నాడు. కేవలం పేరుకు హిందీలో విడుదల చేస్తున్నామన్నట్లు కాకుండా సినిమా పూర్తి చిత్రీకరణ ముంబయిలో జరిగేలా దర్శకుడు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘లైగర్‌’ టీమ్‌ దేశ ఆర్థిక రాజధానిలోనే మకాం వేసింది. ఇక ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్యపాండే నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్‌ తన తర్వాతి చిత్రంలో మరో బాలీవుడ్‌ భామతో జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనేగా మీ సందేహం. విజయ్‌తో రోమాన్స్‌ చేయనున్న ఆ బ్యూటీ.. పటౌడీ ప్రిన్సెస్‌ సారా అలీఖాన్‌ అని సమాచారం. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న పాన్‌ ఇండియా చిత్రంలో విజయ్‌ సరసన సారాను తీసుకోవాలని చూస్తున్నారట. ఇందుకు సారా కూడా ఓకే చెప్పిందని సమాచారం. ఇదిలా ఉంటే సారా ఇప్పటికే విజయ్‌కి మంచి ఫ్రెండ్‌గా మారింది. మనీశ్‌ మల్హోత్ర ఏర్పాటు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో విజయ్‌తో పాటు సారా కూడా అటెండ్‌ కావడం అప్పట్లో బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. మరి బాలీవుడ్‌ భామలతో ఆడిపాడుతోన్న విజయ్‌.. హిందీ చిత్ర సీమలో ఏమేర రాణిస్తాడో తెలియాలంటే ‘లైగర్‌’ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Saraalikhan

Saraalikhan

Also Read: Indian Idol: ఇప్పటివరకు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‎లో సంచలనం సృష్టించిన తెలుగు సింగర్స్ వీళ్ళే..

బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రియులకు మరింత చేరువగా రాక్ స్టార్..

శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ నిజాంగానే కాపీ కొట్టారా ?.. అసలు విషయం చెప్పిన ఆర్ఎక్స్100 డైరెక్టర్…

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే