Rana Daggubati: రానా జీవితంలో బెస్ట్ సలహా ఇచ్చింది ఆ టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఎవరా హీరో..? ఏమా సలహా..?
సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే స్టార్స్ తమ సీక్రెట్స్ గురించి చెప్పిన....
Actor RANA: సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే స్టార్స్ తమ సీక్రెట్స్ గురించి చెప్పిన ప్రతీ మాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటుంది. రీసెంట్‌గా అలాంటి ఇంట్రస్టింగ్ విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు టాలీవుడ్ హంక్ రానా. తన లేట్ నైట్ ఫ్రెండ్ ఎవరన్న మ్యాటర్ నుంచి… తనకు బెస్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్ సజెషన్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరో కూడా చెప్పారు.
నెంబర్ వన్ యారీ షో 3వ సీజన్‌కు రెడీ అవుతున్న రానా కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. రామ్ చరణ్‌తో తన అసోసియేషన్ గురించి చెప్పిన రానా… చెర్రీకి అర్ధరాత్రి కాల్ చేసి కూడా తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటానని అన్నారు.
అంతేకాదు తన జీవితంలో బెస్ట్ సజెన్స్ ఇచ్చిన యారీస్ చాలా మందే ఉన్నారన్న రానా.. అల్లు అర్జున్ ఇచ్చిన సజెషన్‌ను స్పెషల్‌గా మెన్షన్ చేశారు. నేను నా రాక్షసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బన్నీ చేసిన కామెంట్‌ను గుర్తు చేసుకున్నారు. ‘ఇప్పటి దాకా ఎలాగోలా స్కెచ్‌లేసుకొని వచ్చేశావు… ఇక్కడి నుంచి స్కిల్ లేకపోతే కష్టం’ అని చెప్పారట బన్నీ. ఇలా టాలీవుడ్ స్టార్ యారీస్‌కి సంబంధించిన సీక్రెట్స్‌తో నెంబర్ 1 యారీ 3వ సీజన్ మార్చి 14 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. తొలి రెండు సీజన్లతో వీక్షకులను ఎంతగానో అలరించిన ఈ దగ్గుబాటి వారసుడు.. ఈ సీజన్‌లో ఇంకెంత వినోదం పంచుతాడో చూడాలి.
Also Read:
Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…