AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: సీతా రామరాజు జోడి ‘సీత’ ఫస్ట్‌లుక్‌ వచ్చేదప్పుడే.. అలియాభట్‌ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ యూనిట్‌.

RRR Movie Update: భాషతో సంబంధం లేకుండా యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. బాహుబలిలాంటి సూపర్‌ హిట్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే..

RRR Movie: సీతా రామరాజు జోడి 'సీత' ఫస్ట్‌లుక్‌ వచ్చేదప్పుడే.. అలియాభట్‌ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ యూనిట్‌.
Alia Bhatt First Look In Rr
Narender Vaitla
|

Updated on: Mar 13, 2021 | 3:29 PM

Share

RRR Movie Update: భాషతో సంబంధం లేకుండా యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. బాహుబలిలాంటి సూపర్‌ హిట్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలుంటాయి. అందులోనూ ఈ సినిమాలో టాలీవుడ్‌ అగ్ర హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగానే రాజమౌళి కూడా సినిమాలో భారీ కాస్టింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీ, నటులను ఇందులో నటింపజేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ మరో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌లో రామ్‌ చరణ్‌ అల్లురి సీతా రామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్‌ అలియాభట్‌ ఫస్ట్‌ లుక్‌ తేదీని ప్రకటించింది. ఇందులో భాగంగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘మా సీతను పరిచయం చేస్తున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అలియా ఫస్ట్‌లుక్‌ను మార్చి 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నాం’ అంటూ క్యా్ప్షన్‌ జోడించారు. ఇక ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్లైమాక్స్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్‌ పనులు జరుపుకుంటోంది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మరి ఇండియన్‌ సెల్యులాడ్‌పై ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: మళ్లీ డ్రగ్స్ రగడ, నటుడు తనీష్‌ సహా ఇంకొందరికి బెంగళూరు పోలీస్ నోటీసులు, ఇంతకీ.. ఎవరా ఐదుగురు..?

బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..

Mehreen Kaur Engaged: ఘనంగా హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్ధం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..