Roberrt Movie: రాబర్ట్ మూవీ ఓటీటీలో విడుదలయ్యేది అప్పుడే.. సన్నహాలు చేస్తున్న చిత్రయూనిట్..
కన్నడ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాబర్ట్’. తెలుగులోనూ ఇదే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు తరుణ్ కిశోర్
కన్నడ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘రాబర్ట్’. తెలుగులోనూ ఇదే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు తరుణ్ కిశోర్ సుధీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో వినోద్ ప్రభాకర్, జగపతిబాబు, రవి శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది.
ఈ మూవీలో కొన్ని డైలాగ్‌లతో పాటు యాక్షన్ సన్నివేశాలు, కొన్ని పాటలు ఆసక్తిగా నిలిచాయి. దర్శన్ అభిమానులకు యాక్షన్ ట్రీట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విషయానికోస్తే.. ఇందులో దర్శన్ రాఘవ ఎక్కువగా దైవభక్తి , శాంతియుతంగా ఉండే వ్యక్తి. అతను లక్నోలో అంత్యక్రియల కార్యక్రమాలకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు సౌత్ క్యాటరింగ్ సర్వీస్ లో కుక్ గా పనిచేస్తుంటాడు. ఇతనికి అర్జున్ అనే కుమారుడు ఉంటాడు. అతను రాఘవకు పూర్తిగా వ్యతిరేకం. అర్జున్ కోపిస్టి, రౌడీగా తయారవుతాడు. అర్జున్ గ్యాంగ్ స్టర్ గా మారి ప్రజలకు ఎన్నో సమస్యలను సృష్టిస్తాడు. ఇక గ్యాంగ్ స్టర్ గా మారిన తన కుమారుడిని ఎలా బయటకు తీసుకువస్తాడనేది ఈ సినిమా కథాంశం.
ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు స్టార్ హీరో దర్శన్ అభిమానులు. మూడు బాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్లలో సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ మూవీని చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్న.. కరోనా భయంతో చాలా మంది థియేటర్ల వైపు రావడం లేదు. ఈ క్రమంలో ఓటీటీలకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ మొదటివారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అమేజాన్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Aslo Read:
టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నోటీసులపై స్పందించిన యంగ్ హీరో తనీష్.. ఏమన్నాడంటే..
బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..