AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati : వెంకటేష్ ‘దృశ్యం 2’లో కీలకపాత్రలో రానా.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటివారబ్బాయి

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో సీనియర్ హీరో వెంకటేష్ ఎప్పుడు ముందుంటారు. మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నటిస్తున్నారు వెంకీ. ఇక త్వరలో నారప్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు...

Rana Daggubati : వెంకటేష్ 'దృశ్యం 2'లో కీలకపాత్రలో రానా.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటివారబ్బాయి
Rana
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2021 | 3:08 AM

Share

Drishyam 2 : విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో సీనియర్ హీరో వెంకటేష్ ఎప్పుడు ముందుంటారు. మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నటిస్తున్నారు వెంకీ. ఇక త్వరలో నారప్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకీ. వీటిలో దృశ్యం 2 సినిమాను శరవేగంగా పూర్తి చేసి ఎఫ్ 3కంటే ముందే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.

ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు. ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మోహన్ లాల్, మీనా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. తొలి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచే ఈ సినిమా కథ మొదలైంది. అప్పుడు చంపేసిన కుర్రాడి శవాన్ని బయటికి తీసి..పోలీసులు ఈ కేసును మళ్లీ తిరగతోడుతారు.. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.ఇక తెలుగులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరో రానా కీలక పాత్రలో నటిస్తున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రానా స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. దృశ్యం-2 సినిమాలో తన పాత్ర గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. దీంతో రానా క్యారెక్టర్ పై క్లారిటీ వచ్చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సిరివెన్నెల కాలంనుంచి జాలువారిన మరో అందమైన పాట.. ‘టక్ జగదీష్’నుంచి “కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు” అనే సాంగ్

Chaavu Kaburu Challaga : చావు కబురు చల్లగా నుంచి సీనియర్ నటి ఆమని లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Rang De : పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకోవద్దంటున్న నితిన్.. ‘రంగ్ దే’ మరోసాంగ్..