సిరివెన్నెల కాలంనుంచి జాలువారిన మరో అందమైన పాట.. ‘టక్ జగదీష్’నుంచి “కోలో కోలన్న కోలో కొమ్మలు” అనే సాంగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల..
Tuck Jagadish : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎస్. తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక సినిమాలో సందర్భానుసారం వచ్చే ఒక పాటకు చక్కని మెలోడీ ట్యూన్స్ సమకూర్చారు తమన్. “కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి..” అంటూ ప్రసిద్ధ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ మోటివేషనల్ సాంగ్‌ను అర్మాన్ మాలిక్, హరిణి ఇవ్వటూరి, శ్రీకృష్ణ, తమన్ కలిసి ఆలపించారు. నాని ఫ్యామిలీపై ఈ పాటను చిత్రీకరించారు. కుటుంబ అనుబంధాలను తెలియజేస్తూ, చిన్ననాటి కేరింతల్ని గుర్తుచేస్తూ, హీరోను మోటివేట్ చేస్తూ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఈ పాటను ఆలపిస్తున్నారని వింటే అర్థమవుతోంది.
చక్కని సాహిత్య విలువలతో చెవులకు ఇంపుగా వినిపిస్తూ మళ్లీ మళ్లీ పాడుకొనే రీతిలో ఈ పాట ఉంది. “ఆ నలుగురితో చెలిమి పంచుకో చిరునగవు సిరులు పెంచుకో.. జడివానే పడుతున్నా జడిసేనా తడిసేనా నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా..” లాంటి లైన్లు సీతారామశాస్త్రి గారికి కాకుండా ఎవరికి సాధ్యమవుతాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీతో దృశ్యపరంగా ఈ పాట చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఈ పాటలో నానితో పాటు ఆయన తండ్రిగా నటిస్తోన్న నాజర్, అన్నగా నటిస్తోన్న జగపతిబాబు, హీరోయిన్లు రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్, ఫ్యామిలీ మెంబర్స్ అయిన రావు రమేష్, రోహిణి, దేవదర్శిని తదితరులు కనిపిస్తున్నారు. ఇక నాని కెరియర్ లో 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ‘టక్ జగదీష్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Chaavu Kaburu Challaga : చావు కబురు చల్లగా నుంచి సీనియర్ నటి ఆమని లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..