G Anand passed away : మహమ్మారి కాటుకు మరో సీనియర్ సింగర్ బలి.. కరోనాతో కన్నుమూసిన జి. ఆనంద్ ..
కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులను మనకు కాకుండా చేసుంది ఈ కరోనా.
singer G Anand passed away : కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులను మనకు కాకుండా చేసుంది ఈ కరోనా. ఎంతో మంది లెజెండ్స్ కరోనా వల్ల కన్నుమూసి సినిమా ఇండస్ట్రీని తీరని విషాదంలోకి నెట్టారు. తాజాగా సీనియర్ గాయకుడు కరోనా తో కన్నుమూశారు. సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడినట్లు తెలిసింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామం. తన గాత్రంతో 70లలో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘విఠలా విఠలా పాండురంగ విఠలా’వంటి అనేక పాటలు పాడారు.
ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. ‘గాంధీనగర్ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే పలు సీరియల్స్ కు కూడా నేపధ్యసంగీతం అందించారు ఆనంద్. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :