Anand Devarakonda: ఫుల్ జోష్ లో దేవరకొండ బ్రదర్.. మరో సినిమా మొదలుపెట్టిన ఆనంద్..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఈ కుర్రాడు హీరోగా పరిచయం అయ్యాడు.

Anand Devarakonda: ఫుల్ జోష్ లో దేవరకొండ బ్రదర్.. మరో సినిమా మొదలుపెట్టిన ఆనంద్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2021 | 8:36 AM

Anand Devarakond:  క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఈ కుర్రాడు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆతర్వాత ఇటీవల మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ…సినిమాలు చేస్తున్నాడు ఈ దేవరకొండ బ్రదర్. చేసిన రెండు సినిమాలతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ప్రస్తుతం పుష్పక విమానం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యిందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో మరో సినిమాను మొదలు పెట్టాడు.

‘హైవే’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీఐశ్వర్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా తాజాగా పూజాకార్యక్రమాలను జరుపుకుంది. ఆనంద్ దేవరకొండపై ఎమ్మెల్యే జి. కిషోర్ కుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీరభద్రం ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమాతో గుహన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. కరోనా ఉద్ధృతి తగ్గిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Genelia Reentry: భ‌ర్త నుంచి అనుమ‌తి పొందిన హాసిని.. టాలీవుడ్‌లోనే జెనిలీయా రీ ఎంట్రీ.?

Acharya Athreya : మనసుమీద మనసుపడ్డ మహామనిషి ఆచార్య ఆత్రేయ

Mandela Remake: త‌మిళ చిత్రం మండేలా రీమేక్‌లో న‌టించేది బండ్ల గ‌ణేశ్ కాదంటా.. తాజాగా వినిపిస్తోన్న కొత్త పేరు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!