మరో విషాదం.. కరోనా సోకి ప్రముఖ నటి మృతి.. సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు..
Sri Prada:దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది. ఇక రోజులో దాదాపు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Sri Prada:దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది. ఇక రోజులో దాదాపు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే కోవిడ్ మరణాల సంఖ్య కూడా రోజు రోజూకీ పెరిగిపోతుంది. ఇక మరోవైపు ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతున్నాయి. ఇక సినీ పరిశ్రమపై ఈ వైరస్ ప్రభావం బారిగానే పడింది. కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ నటి శ్రీప్రద కరోనాతో కన్నుముశారు. ఇక శ్రీప్రద మరణ వార్తను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ సంతాపాన్ని తెలిపింది.
భోజ్ పురికి చెందిన శ్రీప్రద 1980 నుంచి 1990లలో అప్పటి బడా హీరోలు ధర్మేంద్ర, వినోద్ ఖన్నా నటించిన బట్వారాతోపాటు, దిల్‌రూబా తంగేవాలి, షోలే ఔర్ తూఫాన్ లాంటి అనేక హిందీ మూవీలతోపాటు, భోజ్‌పురీ, కొన్ని దక్షిణ చిత్రాలలో కూడా నటించారు. ముఖ్యంగా కైసీ యే యారియాన్, జీ హర్రర్ షో, అధూరి కహానీ హామారి టీవీ షోలతో శ్రీప్రద ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలోనే ఆమె అప్పటి హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రద పేర్ల నుంచి శ్రీప్రదగా మార్చుకున్నారు. 1978లో పురాణ పురుష్ తో ప్రారంభించిన ఆమె కెరీర్ ప్రారంభంలో గోవింద, రాజ్ బబ్బర్ లాంటి ప్రముఖుల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ధరం సంకట్, ఉమర్ 55కి దిల్ బచ్పాన్ కా, అఖీర్ కౌన్ థీ వో? లూటెరే ప్యార్ కే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ట్వీట్..
#CINTAA expresses its deepest condolence on the demise of #SriPrada (Member since March 1989) @Djariwalla @actormanojjoshi @amitbehl1 @SuneelSinha @deepakqazir @NupurAlankar @abhhaybhaargava @sanjaymbhatia @rajeshwarisachd @neelukohliactor @JhankalRavi @rakufired @GhanshyamSriv19 pic.twitter.com/8b4Ynm3iMt
— CINTAA_Official (@CintaaOfficial) May 5, 2021
పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..