Tamannah November Story: ఇంత‌కీ ఆ హ‌త్య చేసింది ఎవ‌రు.? ఆస‌క్తిక‌రంగా న‌వంబ‌ర్ స్టోరీ ట్రైల‌ర్‌..

Tamannah November Story: ఇటీవ‌లి కాలంలో ఓటీటీల హ‌వా పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా బడా సంస్థ‌లు ఈ రంగంలోకి అడుగుపెట్ట‌డంతో ఓటీటీ వేదికగా వెబ్‌సిరీస్‌లు తెర‌కెక్కుతున్నాయి. టాప్ హీరో, హీరోయిన్లు...

Tamannah November Story: ఇంత‌కీ ఆ హ‌త్య చేసింది ఎవ‌రు.? ఆస‌క్తిక‌రంగా న‌వంబ‌ర్ స్టోరీ ట్రైల‌ర్‌..
November Story
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2021 | 6:10 AM

Tamannah November Story: ఇటీవ‌లి కాలంలో ఓటీటీల హ‌వా పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా బడా సంస్థ‌లు ఈ రంగంలోకి అడుగుపెట్ట‌డంతో ఓటీటీ వేదికగా వెబ్‌సిరీస్‌లు తెర‌కెక్కుతున్నాయి. టాప్ హీరో, హీరోయిన్లు కూడా వీటిల్లో న‌టిస్తుండ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌స్తోంది. వెబ్ సిరీస్ ట్రెండ్‌ను న‌టి త‌మ‌న్నా ముందుగా అందుకున్నారు. త‌మ‌న్నా ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో వ‌చ్చిన లెవెంత్ అవ‌ర్ వెబ్ సిరీస్‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

ఇక తాజాగా త‌మ‌న్నా న‌వంబ‌ర్ స్టోరీ అనే మ‌రో వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. హాట్ స్టార్ వేదిక‌గా ఈ వెబ్ సిరీస్ విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ అద్యంతం ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎవ‌రో ఓ కిరాత‌కుడు ఒక వ్య‌క్తిని అత్యంత దారుణంగా హ‌త్చ చేస్తాడు. పెన్నుతో ఏకంగా 47 సార్లు పొడిచి కృరంగా హ‌త‌మార్చి ఆధారాలు దొర‌క్కుండా మృత‌దేహంపై పెయింట్ పోస్తాడు. దీంతో ఆ కేసు ఒక మిస్ట‌రీగా మారుతుంది. కేసు విచార‌ణ‌లో భాగంగా త‌మ‌న్నా తండ్రిని పోలీసులు అనుమానిస్తారు. ఈ నేపథ్యంలో త‌న తండ్రిపై ప‌డ్డ హ‌త్యారోప‌ణను చేధించే ప‌నిలో ప‌డుతుంది త‌మ‌న్నా. ఈ క్ర‌మంలో త‌మ‌న్నాకు ఎలాంటి ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయ‌న్న ఆస‌క్తిక‌ర అంశంతో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. ట్రైల‌ర్‌ను చూస్తుంటే త‌మ‌న్నాకు మ‌రో సూప‌ర్ హిట్ ద‌క్కిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను హాట్ స్టార్ వేదిక‌గా ఈ నెల 20న విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రి ఈ థ్రిల్ల‌ర్ ట్రైల‌ర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

న‌వంబ‌ర్ స్టోరీ ట్రైల‌ర్‌..

Also Read: Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్.. ‘పుష్ప’ స్టోరీని సుకుమార్ అలా ప్లాన్ చేశాడా ?

మరో విషాదం.. కరోనా సోకి ప్రముఖ నటి మృతి.. సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు..

మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!