Actress Leelavathi: సీనియర్ నటి లీలావతి మరణం.. మీ నటన మరువలేది అంటూ ప్రధాని మోడీ సంతాపం..

లీలావతి కర్ణాటకలోని నీలమంగళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుదీర్ఘమైన సినీ కెరీర్ లో  600లకు పైగా సినిమాల్లో నటించారు. సినిమాలతో పాటు, థియేటర్ లో నాటకాల్లో కూడా నటించారు. తన కెరీర్‌లో కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించారు. కర్ణాటక బెల్తంగడి జిల్లాలో జన్మించిన ఆమె అసలు పేరు లీలా కిరణ్. వ్యక్తిగత జీవితంలో ఎన్నో  ఎత్తుపల్లాలను ఎదుర్కొంది. 6 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న లీలావతి నటిగా మారి.. తనదైన నటనతో పెద్ద ఆర్టిస్ట్‌గా ఎదిగారు.

Actress Leelavathi: సీనియర్ నటి లీలావతి మరణం.. మీ నటన మరువలేది అంటూ ప్రధాని మోడీ సంతాపం..
Actress Leelavathi Dead

Updated on: Dec 09, 2023 | 12:06 PM

చలన చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ కమెడియన్ జూనియర్ మోహముద్ మరణ వార్త నుంచి ఇంకా తేరుకోకముందే.. మరో సీనియర్ నటి ఈ రోజు కన్నుమూశారు. సినీ పరిశ్రమలో అతి సుదీర్ఘమైన కెరీర్ సుమారు ఐదు దశాబ్దాల పాటు నటించిన నటి లీలావతి (85) కన్నుమూశారు. వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న లీలావతి కర్ణాటకలోని నీలమంగళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుదీర్ఘమైన సినీ కెరీర్ లో  600లకు పైగా సినిమాల్లో నటించారు. సినిమాలతో పాటు, థియేటర్ లో నాటకాల్లో కూడా నటించారు. తన కెరీర్‌లో కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించారు.

కర్ణాటక బెల్తంగడి జిల్లాలో జన్మించిన ఆమె అసలు పేరు లీలా కిరణ్. వ్యక్తిగత జీవితంలో ఎన్నో  ఎత్తుపల్లాలను ఎదుర్కొంది. 6 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న లీలావతి నటిగా మారి.. తనదైన నటనతో పెద్ద ఆర్టిస్ట్‌గా ఎదిగారు. ఆమె కుమారుడు వినోద్ రాజా కూడా ఒక నటుడే.. కుమారుడితో కలిసి లీలావతి నివస్తుంది.

ఇవి కూడా చదవండి

లెజెండరీ కన్నడ సినీ నటీమణి లీలావతి మరణవార్త విని పలువురు సినీ నటీనటులు విచారం వ్యక్తం చేశారు. సినిమాకి నిజమైన ఐకాన్..  అనేక చిత్రాలలో తన బహుముఖ నటనతో వెండితెరను అలంకరించారు. ఆమె వైవిధ్యమైన పాత్రలు, విశేషమైన ప్రతిభ ఎప్పటికీ గుర్తుండిపోతుందని లీలావతి ని గుర్తు చేసుకుంటున్నారు.

సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ

లీలావతి మృతితో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. లీలావతి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంతాపం తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటీమణి అయిన లీలావతి మృతి తనను చాలా బాధించిందని తెలిపారు. తన వైవిధ్యమైన నటనతో వెండి తెరను ఏలిన లీలావతి మరణం తీరని లోటు ఓం శాంతి అంటూ.. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఎన్నో అవార్డులు అందుకున్న లీలావతి

లీలావతి తన సుదీర్ఘ కెరీర్‌లో 600కి పైగా సినిమాల్లో నటించారు. అందులో 400కి పైగా కన్నడ సినిమాలు. మాంగల్య యోగం, ధర్మ విజయ్, రాణి హొన్నామా, బేవు వెల్ల, వాలర్ పిరై, వాల్మీకి, వాత్సల్య, నాగపూజ,  సంత్ తుకారాం వంటి అనేక చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమా సూపర్ స్టార్ డాక్టర్ రాజ్‌కుమార్‌తో చాలా సినిమాల్లో నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు, డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..