Godse: మరో విభిన్నకథతో రానున్న వెర్సటైల్ హీరో.. సత్యదేవ్ గాడ్సే రిలీజ్ అయ్యేది అప్పుడే..
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు హీరో సత్యదేవ్. ఇటీవలే స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు హీరో సత్యదేవ్(Satya dev). ఇటీవలే స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెర్సటైల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘గాడ్సే’(Godse). గోపి గణేష్ పట్టాభి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా విభిన్నమైన కథాంశం తో తెరకెక్కుతోందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను మే 20న గ్రాండ్ లెవల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయటంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా గోపి గణేష్ అందిస్తున్నారు. గాడ్సే సినిమా రిలీజ్ డేట్‌ను తెలియజేసే పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే కోటు వేసుకున్న సత్యదేవ్ రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకుని ఇన్‌టెన్స్‌గా చూస్తున్నట్టు డిజైన్ చేశారు. అలాగే అతడి నుదుటిపై గాయం కనిపిస్తుంది. అవినీతిమయమైన రాజకీయ నాయకుడిని, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సి.కె.స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నాజర్, షాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :