Prabhas: ‘మన డార్లింగ్ కోసం’.. ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో చూశారా?

జ్యోతిష్కుడిగా వేణు స్వామి ఎంత పాపులరో ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా వీణ వాయించడంలో బాగా ఫేమస్. ఎప్పుడూ చేతిలో వీణతో కనిపించే ఆమె తెలుగు, హిందీ సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణపై పలికిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు బాగా ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కోసం ఒక స్వీట్ గిఫ్ట్ ను పంపారు.

Prabhas: 'మన డార్లింగ్ కోసం'.. ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో చూశారా?
Veena Srivani, Prabhas, Venu Swamy
Follow us

|

Updated on: Apr 16, 2024 | 4:10 PM

ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ నిత్యం ట్రెండింగ్‌లో ఉంటారాయన. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలోనూ బాగా ఫేమస్ అయిపోయారు వేణు స్వామి. రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే పనిలో ఉన్నారు. జ్యోతిష్కుడిగా వేణు స్వామి ఎంత పాపులరో ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా వీణ వాయించడంలో బాగా ఫేమస్. ఎప్పుడూ చేతిలో వీణతో కనిపించే ఆమె తెలుగు, హిందీ సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణపై పలికిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు బాగా ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కోసం ఒక స్వీట్ గిఫ్ట్ ను పంపారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్‌ లో పోస్ట్ చేశారు. ఇందులో వారు పండించిన సీతా ఫలాలను చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్ కు పంపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

సీతాఫలాలతో పాటు…

‘మేం పండించే సీతాఫలాలు ఏటా కోంతమందికి పంపుతాం. ఇలా ఓ స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే ఆయన దగ్గరి నుంచి ప్రభాస్ వద్దకు చేరాయి. నేను పంపిన సీతా ఫలాలు ప్రభాస్ కు బాగా నచ్చాయి. ఇంకొన్ని కావాలని అడిగారు. మరి పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఉండగలరా? చెప్పండి. అందుకే ఈ బాస్కెట్ లో ఉన్న సీతా ఫలాలన్నీ ప్రభాస్ కోసం పంపిస్తున్నాను. వీటితో పాటు నా గుర్తుగా హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా పంపుతున్నాను. ఈ ఏడాదికి ఇదే ఆఖరి పంట. మళ్లీ వచ్చే సీజన్ లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను’ అని చెప్పుకొచ్చారు వీణా శ్రీవాణి.

ఇవి కూడా చదవండి

వీణా శ్రీవాణి వీడియో ఇదిగో..

ఫ్యాన్స్ ఫిదా..

ప్రభాస్ జాతకం విషయంలో అభిమానులతో చీవాట్లు తిన్నారు వేణుస్వామి. అయితే ఇప్పుడు ఆయన సతీమణి వీణా శ్రీవాణి పంపిన గిఫ్ట్ ను చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వేణు స్వామి సతీమణి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

 ఇన్ స్టా లో బిజీబిజీగా వేణు స్వామి దంపతులు.. రీల్స్ చేస్తూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో