AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: విమానంలో సాంకేతిక సమస్యలు .. ఆ దేవుడి పైనే భారమంటూ వీడియో షేర్ చేసిన వేణు స్వామి భార్య

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానంలో ప్రయాణం చేయాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య ప్రయాణిస్తోన్న విమానంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Venu Swamy: విమానంలో సాంకేతిక సమస్యలు .. ఆ దేవుడి పైనే భారమంటూ వీడియో షేర్ చేసిన వేణు స్వామి భార్య
Venu Swamy wife Veena Srivani
Basha Shek
|

Updated on: Jul 10, 2025 | 6:50 PM

Share

కొన్ని రోజుల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదంలో ఏకంగా 270 మందికి పైగా ప్రయాణికులు మరణించడంతో యావత్ దేశం తల్లడిల్లింది. దీని తర్వాత కూడా వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఫ్లైట్ జర్నీ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. తాజాగా వేణు స్వామి భార్య వీణా శ్రీవాణికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఆమె ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వేణు స్వామి భార్యతో పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో షేర్ చేశాడు. ‘అనుకోకుండా విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే విమానంలోకి ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఎంతో భయంతోనే ఉన్నాను. అసలు సేఫ్ గా భూమి మీదకు ల్యాండ్ అవుతామా? లేదా? గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా? అనే భయంతోనే విమాన ప్రయాణం చేశాను. ఈ విమానంలో ప్రయాణిస్తున్నంత సేపు భగవంతుడిపైనే భారం వేసాను. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేవరకు ఏసీలు పనిచేయలేదు. దీని వల్ల వందలాది మంది ప్రయాణికులు అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.

‘ఇలా ఏసీలు పనిచేయకపోవడంతో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే సందేహాలు అందరికీ కలిగాయి. ఇదే విషయం గురించి సిబ్బందిని ప్రశ్నించిన సరైన సమాధానం మాత్రం రాలేదు. ఇలా ఏసి పనిచేయకపోవడంతో ఇదేదో చెడుకు సంకేతంగా భావించాం. విమానం దిగే వరకు క్షణక్షణం భయంతోనే గడిపాం. వందల మందితో ప్రయాణం చేస్తున్నటువంటి విమానంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదు? ఈ సమస్య గురించి ప్రశ్నిస్తే సిబ్బంది మాత్రం చిన్న సారీ చెబుతున్నారు. సారీ చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ‘ అంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది వీణా శ్రీవాణి.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి భార్య షేర్ చేసిన వీడియో..

ఏది ఏమైనా తాము ప్రయాణిస్తోన్న విమానంలో ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యామని వీడియోలో చెప్పుకొచ్చింది వేణు స్వామి భార్య. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీణ వాణి వేణు స్వామి భార్యగా మాత్రమే కాకుండా వీణ వాయిద్యకారిణిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..