SreeLeela: హీరోయిన్ శ్రీలీల జాతకం చెప్పిన వేణు స్వామి.. ఏమన్నారంటే
తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ రాణిస్తున్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఇప్పుడు దూసుకుపోతుంది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది ఈ భామ. ఏకంగా సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాల్లోనూ సినిమా చేస్తుంది. మహేష్ బాబు బాటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలు రావడం కొత్తేమీ కాదు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ రాణిస్తున్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఇప్పుడు దూసుకుపోతుంది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది ఈ భామ. ఏకంగా సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాల్లోనూ సినిమా చేస్తుంది. మహేష్ బాబు బాటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే కుర్ర హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో ఎనిమిది సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల జాతకం చెప్పారు వేణు స్వామి.
వేణు స్వామి.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఆయన చెప్పిన జాతకాలు చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీల జాతకాలు చెప్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు. మొన్నామధ్య నిధి అగర్వాల్.. ఆ తర్వాత డింపుల్ హయతి కూడా పూజలు చేయించుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి శ్రీలీల జాతకం చెప్పారు. శ్రీలీల జాతకంలో రాజయోగం ఉంది అని అన్నారు. రానున్న రోజుల్లో ఆమె కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని అన్నారు. అలాగే ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. 2028 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీలనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతారని చెప్పుకొచ్చారు వేణు స్వామి. అలాగే లేడీ సూపర్ స్టార్ రాణిస్తున్న నయనతార జాతకానికి శ్రీలీల జాతకానికి దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారు వేణుస్వామి.




