డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో వెంకటేశ్ నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో వెంకటేశ్ తోపాటు నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి సందడి చేశారు. డిసెంబర్ 27 నుంచి ఈ ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే బాలయ్య అడిగిన ప్రశ్నలు, వెంకీమామను చెప్పిన ఆన్సర్స్ పై అందరికీ ఆసక్తి నెలకొంది.
ఈ ఎపిసోడ్ లో చాలా అంశాల గురించి మాట్లాడారు వెంకటేశ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నీ రిలేషన్ ఎలా ఉంటుందని బాలయ్య అడగ్గా.. వెంకటేశ్ మాట్లాడుతూ.. “సినిమాల కంటే ముందే పవన్ తో నాకు పరిచయం ఉంది. మా ఇంటికి ఎక్కువగా వచ్చేవాడు. అప్పట్లో నా దగ్గర లేజర్ డిస్కులు ఉండేవి. వాటి కోసమే పవన్ మా ఇంటికి వచ్చేవాడు. మేమిద్దరం భక్తి భావంతో కనెక్ట్ అయ్యాం. ఇద్దరికీ భక్తి ఎక్కువ. ఇద్దరం ఎక్కువ సైలెంట్ గా ఉంటాము. ఆ సైలెంట్ లోనే ఒకరికొకరు అర్థం చేసుకుంటాం ” అని చెప్పుకొచ్చారు.
అలాగే మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. “ఇటీవలే మహేష్ కు మెసేజ్ చేశాను. పూలకుండీ ఎందుకు తన్నావు అని కానీ రిప్లై ఇవ్వలేదు. మహేష్ అందిరికీ గౌరవం ఇస్తాడు. ఆ సినిమా సమయంలో ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం. నిజమైన అన్నదమ్ముల్లాగే చేశాము. ఇప్పుడు కూడా కలవకపోయినా ఎప్పుడన్నా కలిస్తే నా చిన్న తమ్ముడిలా అనిపిస్తాడు ” అని అన్నారు. ప్రస్తుతం వెంకటేశ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి చెప్పిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
Victory Venkatesh 😍😍😍 about Pawan Kalyan in Unstoppable Show #PawanKalyan#VictoryVenkatesh pic.twitter.com/u00vTM4sVx
— S R R I D H A R 🦅 (@dhaasss09) December 28, 2024
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.