Tollywood: ఇండస్ట్రీలోనే చక్రం తిప్పిన హీరోయిన్.. భర్త స్టార్ క్రికెటర్.. ఎవరో గుర్తుపట్టారా..
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయో చెప్పక్కర్లేదు. తాజాగా ఓ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె సంచలనం. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఓ స్టార్ క్రికెటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో తన సోదరుడితో కలిసి నవ్వులు చిందిస్తున్న ఆ అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ హీరోయిన్ అనుష్క శర్మ.
అందం, అభినయంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనుష్క శర్మ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన అనుష్కా.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన రబ్ నే బనాది జోడి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఫస్ట్ మూవీలోనే షారుఖ్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017 డిసెంబర్ 11న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క, విరాట్ దంపతులు లండన్ లో వెకేషన్ లో ఉన్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.