Varun Tej: వరుణ్‌ తేజ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? మూడు నెలల కొడుకు కోసం ఏం చేశాడో చూశారా? వీడియో

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 10న వీరికి లావణ్య ఓ పండంటి మగబిడ్డకు జ‌న్మినిచ్చిన సంగ‌తి తెలిసిందే. తమ కుమారుడికి వాయువ్ తేజ్ అని పేరు పెట్టుకున్నారు వరుణ్- లావణ్య దంపతులు

Varun Tej: వరుణ్‌ తేజ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? మూడు నెలల కొడుకు కోసం ఏం చేశాడో చూశారా? వీడియో
VarunTej, Lavanya Tripathi

Updated on: Dec 12, 2025 | 10:01 PM

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తమ కుమారుడి ఆలనా పాలనతో బిజీగా ఉన్నారు. 2023లో వీరిద్ద‌రి వివాహం జరగ్గా, ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 10న వీరికి ఓ పండంటి మగబిడ్డ జన్మించాడు. కొణిదెల ఫ్యామిలీకి ఇష్ట దైవ‌మైన హ‌నుమంతుడి పేరు వ‌చ్చేలా తమ కుమారుడికి వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టారు వరుణ్లావణ్య. కాగా వాయువ్ తేజ్ పుట్టి మూడు నెల‌లు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఈ దంపతులు త‌మ కొడుకు మూడో నెల బ‌ర్త్ డే ను మ‌రింత స్పెష‌ల్ గా సెల‌బ్రేట్ చేశారు. సందర్భంగా తన కుమారుడి కోసం వరుణ్ తేజ్ నే స్వయంగా బుజ్జి కేకును తయారు చేశాడు. దానిపై వినాయకుడి చిత్ర పటాన్ని ముద్రించి ఎంతో మంచి డిజైన్ తో కేక్ రెడీ చేశాడు. అనంతరం బుజ్జి కేకుతో సరదాగా ఫొటోలు వరుణ్లావణ్య దంపతులు. ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అయితే ఈ వీడియోలో కూడా త‌మ కొడుకు ఫేస్ ను మాత్రం ఎక్కడా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు వ‌రుణ్, లావ‌ణ్య‌ దంపతులు.

ఇక సినిమాల విషయానికి వస్తే..  మధ్యన వరుణ్ తేజ్ చిత్రాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. ముఖ్యంగా అతను నటించిన చివరి సినిమా మట్కా భారీ అంచనాల మధ్య రిలీజై అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు బాగా ట్రై చేస్తున్నాడీ మెగా హీరో. ఇందులో భాగంగానే ప్రస్తుతం కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు వరుణ్. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ మూవీ ఈ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.

ఇవి కూడా చదవండి

కుమారుడి కోసం కేకు తయారు చేస్తోన్న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి.. వీడియో..

ఉపాసన సీమంతంలో వరుణ్ తేజ్ -లావణ్య దంపతులు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .