Niharika Konidela: నిహారిక- చైతన్య విడాకులు.. ఈ విషయం మీకు తెల్సా…
ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు సినీ ఇండస్ట్రీలో వెరీ కామన్‌గా మారిపోయాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. మెగాబ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక వైవాహిక బంధానికి ముగింపు పలకడం హాట్ టాపిక్‌గా మారింది. కాంప్రమైజ్‌కి ఎంత ట్రై చేసినా కుదరకపోయేసరికి చివరికి విడాకులు తీసుకున్నారు.

సినీ పరిశ్రమలో ఇటీవల విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకున్నారు. నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక.. భర్త చైతన్య నుంచి విడిపోయారని కొద్ది కాలంగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతంది. ఆ ప్రచారం నిజమేనని తేలింది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకోగా, నెలరోజుల కిందటే కోర్టు డైవోర్స్ మంజూరు చేసింది.
గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారికకు 2020 ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ జరిగింది.రాజస్థాన్ ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌లొ 2020 డిసెంబరులో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తువచింది నిహారిక. అయితే అనూహ్యంగా వీళ్లిద్దరి డివోర్స్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని వార్తలు వచ్చాయి.రీసెంట్‌గా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో మరోసారి ఈ ఇష్యూ హాట్‌టాపిక్ అయింది. అటు చైతన్య కూడా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలను తొలగించడంతో విడాకుల మ్యాటర్‌కు బలం చేకూరింది. మరోవైపు, మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం చర్చకు దారి తీసింది. ఈ విషయమై నెట్టింట బోలెడన్ని వార్తలు షికారు చేసినా అటు మెగా ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు నిహారిక దంపతుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇటీవల చైతన్య సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కూడా నెట్టింట సర్కులేట్ అవుతుంది. తాను ఓ మెడిటేషన్ సెంటర్‌లో ఫోటోను షేర్ చేసిన చైతన్య …. నేను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ చాలా థాంక్స్. మనం ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎక్కడికైనా వెళ్తే.. మెరుగైన జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది కూడా అలాంటిదే.. అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. చివరికి నెట్టింట రచ్చ చేసిన రూమర్సే నిజమయ్యాయి. ఎంతో అద్భుతంగా జరిగిన వీరి పెళ్లి.. మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కాగా ఫస్ట్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీ ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత నిహారిక తరుపున విడాకుల పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని సమాచారం. ఆయన మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అందుకే విషయం గోప్యంగా ఉంది.
ఇక మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక.. యాంకర్‌గా, హీరోయిన్‌గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి కాగానే సినిమాలకు, నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక.. రీసెంట్ గా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..