Ghani Pre Release : ఐకాన్ స్టార్ గెస్ట్‌గా గని ప్రీరిలీజ్ ఈవెంట్ .. భారీగా తరలివచ్చిన అభిమానులు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ముకుంద సినిమా నుంచి మొన్నీమధ్య వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా వరకు డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు వరుణ్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ముకుంద సినిమా నుంచి మొన్నీమధ్య వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా వరకు డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు వరుణ్. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు, పాటలు, గ్లిమ్ప్స్ ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రిపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్.
గని ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. ఇప్పటికే వైజాగ్ చేరుకున్న బన్నీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే విడుదలైన గని టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్. దీనికోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
