Varun Tej- Lavanya: చూడముచ్చటైన జంట.. నా లవ్‌ దొరికిందంటూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్‌ చేసిన వరుణ్‌, లావణ్య

|

Jun 10, 2023 | 5:55 AM

తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు వరుణ్‌, లావణ్య. 'లవ్‌ దొరికిందంటూ' ఈ లవ్‌ బర్డ్స్‌ షేర్‌ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గామారాయి. కాబోయే పెళ్లి కూతురు లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది.

Varun Tej- Lavanya: చూడముచ్చటైన జంట.. నా లవ్‌ దొరికిందంటూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్‌ చేసిన వరుణ్‌, లావణ్య
Varun Tej, Lavanya Tripathi
Follow us on

మెగాస్టార్‌ ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌ సందడి మొదలైంది. హీరో వరుణ్‌తేజ్‌ , లావణ్య త్రిపాఠిలకు వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కొణిదెల నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వరుణ్‌, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వరుణ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో సందడి చేశారు. ఇక నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు వరుణ్‌, లావణ్య. ‘లవ్‌ దొరికిందంటూ’ ఈ లవ్‌ బర్డ్స్‌ షేర్‌ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గామారాయి. కాబోయే పెళ్లి కూతురు లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది. దీంతో
పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ‘చూడముచ్చటైన జంట, క్యూట్‌ జోడీ’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా టాలీవుడ్‌లో వరుణ్, లావణ్య రెండు సినిమాల్లో కలిసి నటించారు. హీరోగా వరుణ్‌తేజ్‌ ముకుంద చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక అందాల రాక్షసితో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి…ప్రస్తుతం తెలుగు, తమిళచిత్రాలతోపాటు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. కొంతకాలంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. ఈ యేడాది చివరిలోనే వివాహ వేడుక ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.