AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanushree Mehra: ‘ఇండస్ట్రీలో పెద్ద సమస్య ఇదే.. ఇకనైనా ఆ పద్ధతికి ముగింపు పలకండి’.. వరుడు హీరోయిన్ కామెంట్స్ వైరల్..

తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న ప్రధాన సమస్య అదే అని.. ఇకనైనా ఈ మూసపద్ధతికి ముగింపు పలకాలంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Bhanushree Mehra: 'ఇండస్ట్రీలో పెద్ద సమస్య ఇదే.. ఇకనైనా ఆ పద్ధతికి ముగింపు పలకండి'.. వరుడు హీరోయిన్ కామెంట్స్ వైరల్..
Bhanushree Mehra
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2023 | 12:46 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. ఈ సినిమా సమయంలో ఈ ముద్దుగుమ్మకు వచ్చిన అంతఇంతా కాదు. అందుకు కారణం ఆమె ఫేస్ రివీల్ చేయకపోవడమే. కానీ సినిమా విడుదలైన తర్వాత భానుశ్రీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, పంజాబీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన భానుశ్రీ హీరోయిన్ గా మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే చాలా రోజులుగా సైలెంట్ అయినా ఈ భామ ఇటీవల తనను అల్లు అర్జున్ బ్లాక్ చేశాడంటూ వార్తల్లోకెక్కింది. తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న ప్రధాన సమస్య అదే అని.. ఇకనైనా ఈ మూసపద్ధతికి ముగింపు పలకాలంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

“సినిమా పరిశ్రమలో ఉన్న అతి ప్రధాన సమస్య వయసు మాత్రమే. వయసు వచ్చినా స్త్రీలను.. పెళ్లైన మహిళలను కేవలం తల్లి, సోదరి, వదినా పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రలలో నటిస్తుంటారు. తమకంటే చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు ?. పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. దైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ పోత్సహించాల్సిన సమంయ ఇది. దీనిని మీరూ అంగీకరిస్తారా ?” అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఇదేమి పెద్ద సమస్య కాదని అంటున్నారు. వయసు కంటే హార్డ్ వర్క్ ఎంతో ముఖ్యమని.. పెళ్లి తర్వాత కూడా పలువురు హీరోయిన్స్ సినిమాలు చేస్తున్నారని.. మీరు కూడా చేయండని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.