Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు స్పెషల్ ఏంటంటే..
ప్రస్తుతం వైష్ణవ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga). డైరెక్టర్ గిరీశయ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కేతిక శర్మ

మొదటి సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఉప్పెన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన వైష్ణవ్ నటన పరంగా సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమాతో ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం వైష్ణవ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga). డైరెక్టర్ గిరీశయ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తికి పెంచేశాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ అనౌన్స్ చేశారు వైష్ణవ్ తేజ్.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల రోజున వైష్ణవ్ తేజ్ మావయ్య.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం విశేషం. మరీ రంగ రంగ వైభవంగా సినిమాతో వైష్ణవ్ మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.




The Love, Laughter & Drama filled Youthful Family Entertainer #RangaRangaVaibhavanga locks a POWERFUL Release Date ??
In theatres from September 2nd ??#PanjaVaisshnavTej #Ketikasharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial @BvsnP @SonyMusicSouth#RRVOnSep2nd pic.twitter.com/pyZZvmEMr3
— Panja Vaisshnav Tej (@VaisshnavTej) July 13, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




