AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaarasudu: తగ్గేదే లే.. సంక్రాంతి రేస్‌కు నేను కూడా రెడీ అంటున్న దళపతి విజయ్..

ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు వంశీ. ఇక తెలుగు తమిళ్ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది

Vaarasudu: తగ్గేదే లే.. సంక్రాంతి రేస్‌కు నేను కూడా రెడీ అంటున్న దళపతి విజయ్..
Thalapathy Vijay
Rajeev Rayala
|

Updated on: Oct 09, 2022 | 4:58 PM

Share

స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ వందకోట్ల ను ఈజీగా వసూల్ చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు వంశీ. ఇక తెలుగు తమిళ్ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారసుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ ఫస్ట్ లుక్ తో ఆ అంచనాలని మరింత భారీగా పెంచింది.

ఇక ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈసారి సంక్రాంతి రేస్ లో టాలీవుడ్ బడా సినిమాలు కూడా పోటీకి ఉండటంతో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దాంతో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

పెద్ద సినిమాలు ఉన్నపటికీ వారసుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలుస్తోంది. దీపావళికి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతి రేస్ లో విజయ్ కూడా దిగుతుండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.