AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సినిమా విషయంలో అలాంటి నిబంధనలు పెట్టుకోనంటున్న సాయి పల్లవి.. కానీ

ఈ సినిమాలో సాయి పల్లవి నటన అందరిని నిజంగానే ఫిదా చేసింది. అచ్చం తెలుగు అమ్మాయిలా నటించి మెప్పించింది సాయి పల్లవి. ఇక ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

Sai Pallavi: సినిమా విషయంలో అలాంటి నిబంధనలు పెట్టుకోనంటున్న సాయి పల్లవి.. కానీ
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Oct 09, 2022 | 4:38 PM

Share

సాయి పల్లవి.. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. మలయాళ సినిమా ప్రేమమ్ తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిన్నది తెలుగులో ఫిదా సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటన అందరిని నిజంగానే ఫిదా చేసింది. అచ్చం తెలుగు అమ్మాయిలా నటించి మెప్పించింది సాయి పల్లవి. ఇక ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ విజయాలను అందుకుంటోంది సాయి పల్లవి. మలయాళం, తెలుగు భాషలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అయితే స్కిన్ షో కు మాత్రం సాయి పల్లవి ఎప్పుడూ నో చెప్తూనే ఉంది. నటన అంటే గ్లామర్ షో మాత్రమే కాదు అంటోంది సాయి పల్లవి.

అయితే సాయి పల్లవి ఒకే తరహా కథలను ఎంచుకోవడం పై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కావాలనే ఈ పాత్రలను ఎంచుకుంటుందని కొందరంటుంటే.. కోయిన్సడెంట్ గానే ఇలాంటి కథలు తన దగ్గరకు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. ఇక ఇదే విషయం పై సాయి పల్లవి స్పందిస్తూ.. తాను ఒక పాత్రలో చేసేటప్పుడు ఇలానే చేయాలని నిబంధనలు ఏమి పెట్టుకోనని చెప్పుకొచ్చింది.

అయితే సినిమా కథను ఎంపిక చేసుకునేటప్పుడు.. తన తోటి నటుల పై తన పాత్ర ఆధారపడేలా చూసుకుంటానని తెలిపింది. నా పర్ఫామెన్స్ కు స్కోప్ ఉండేలా. అలాగే  తోటి నటులపై ఆధారపడి ఉండేలా పాత్రలను ఎంపిక చేసుకుంటానని తెలిపింది. అదేవిధంగా నేను ఏ పాత్ర చేసిన వందశాతం నా పాత్రకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక ఈ అమ్మడు చివరిసారిగా గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరో సినిమా ప్రకటించలేదు ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.