Daaku Maharaaj: ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీ స్టెప్పులపై స్పందించిన ఊర్వశి.. బాలయ్య గురించి ఏమన్నదంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ మూవీలో ఊర్వశి రౌతెలా ఓ కీలక పాత్రలో నటించింది.

Daaku Maharaaj: 'దబిడి దిబిడి' కాంట్రవర్సీ స్టెప్పులపై స్పందించిన ఊర్వశి.. బాలయ్య గురించి ఏమన్నదంటే?
Daaku Maharaaj Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2025 | 8:59 AM

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొల్లి బాబి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 92 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ మూవీ వంద కోట్లకు చేరువలో ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ కీలక పాత్రలో సందడి చేసింది. బాలయ్య నటన, ఫైట్స్, బాబీ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజీఎమ్.. ఇలా డాకు మహారాజ్ సినిమా విజయానికి అన్నీ అంశాలు దోహదం చేశాయి. వీటితో పాటు మొదటి నుంచే దబిడి దిబిడి సాంగ్ కూడా డాకు మహారాజ్ పై హైప్ పెంచింది. ఇప్పుడు థియేటర్లలో ఈ సాంగ్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య, ఊర్వశి స్టెప్పులకు విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ లోని కొన్ని స్టెప్పులపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నటి ఊర్వశి రౌతెలా స్పందించింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా దబిడి దిబిడి సాంగ్ పై స్పందించిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

‘ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణ ఒక లెజెండ్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇదంతా కళలో ఓ భాగం. బాలయ్యతో డ్యాన్స్ చేయడమనేది సినిమా పరంగానే కాదు.. కళపై నాకున్న గౌరవానికి ప్రతీకగా నేను భావిస్తాను. డ్యాన్స్‌, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా నేను గౌరవిస్తాను. బాలయ్యతో పనిచేయడం నా కల. ఈ సినిమాతో అది నెరవేరింది. నటీనటులకు ఆయన ఎంతో గౌరవమిస్తారు. సపోర్టు కూడా చేస్తారు’ అని బాలయ్యపై ప్రశంసలు కురిపించింది ఊర్వశి.

ఇవి కూడా చదవండి

దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ పై ఊర్వశి రౌతెలా ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.