AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Movie : ‘ఉప్పెన’ కోసం ఎగబడుతున్న దర్శక నిర్మాతలు.. పలు భాషల్లో రీమేక్ కానున్న మెగాహీరో డెబ్యూమూవీ..

మెగాహీరో గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ  సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Uppena Movie : 'ఉప్పెన' కోసం ఎగబడుతున్న దర్శక నిర్మాతలు.. పలు భాషల్లో రీమేక్ కానున్న మెగాహీరో డెబ్యూమూవీ..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 3:07 PM

Share

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ  సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథగా తెరక్కేక్కిన ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నాటించి ఆకట్టుకున్నాడు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయాలనీ పలు బాషల దర్శక నిర్మాతలు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలనీ పలువురు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. కాగా విజయ్ సేతుపతి ఈ సినిమా తమిళ్ రైట్స్ పై కన్నేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా సరిపోతుందట. ఇంతకు ఆ స్టార్ కిడ్ ఎవరంటే.. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్. ఇప్పటికే ఈ సినిమాను సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట . ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒక బడా ప్రొడ్యూసర్ సినిమా హిందీ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.  ఇషాన్ కట్టర్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధఢక్  సినిమాతో ఇషాన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను హిందీలో ఎవరు రీమేక్ చేయబోతున్నారన్నదని పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే మరో వైపు ‘ఉప్పెన’ను కన్నడ లో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఉప్పెన రీమేక్ పై చర్చలు జరుగుతున్నాయని టాక్. అక్కడు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు కూడా చేయనున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: మల్లయోధులతో తలపడుతోన్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌… వైరల్‌గా మారిన లొకేషన్‌ ఫొటోలు..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..