AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: పెళ్లి తర్వాత మరో ప్రపంచానికి వెళ్లాను.. రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర కామెంట్స్..

ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో పాల్గొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చరణ్ ఉపాసన. ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీ ఉన్నట్లు.. ప్రతి మహిళ విజయం వెనకాల ఓ పురుషుడు ఉండాలని ఉపాసన కొణిదెల అన్నారు. ప్రతి పురుషుడు విజయాన్ని అందుకుంటున్న సమయంలో అతడి వెన్నంటే నీడగా ఉండడం మహిళకు చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చింది.

Upasana Konidela: పెళ్లి తర్వాత మరో ప్రపంచానికి వెళ్లాను.. రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర కామెంట్స్..
Ram Charan, Upasana Konidel
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2024 | 4:52 PM

Share

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. కాలేజీ రోజుల్లో మొదలైన ప్రేమ.. 2012లో వైవాహిక బంధంగా మారింది. పెళ్లైన చాలా కాలం తర్వాత గతేడాది మెగా ప్రిన్సెస్ క్లింకార రాకతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు ఉపాసన, రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చరణ్. మరోవైపు సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతున్నారు ఉపాసన. ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో పాల్గొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చరణ్ ఉపాసన. ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీ ఉన్నట్లు.. ప్రతి మహిళ విజయం వెనకాల ఓ పురుషుడు ఉండాలని ఉపాసన కొణిదెల అన్నారు. ప్రతి పురుషుడు విజయాన్ని అందుకుంటున్న సమయంలో అతడి వెన్నంటే నీడగా ఉండడం మహిళకు చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చింది.

ఉపాసన మాట్లాడుతూ.. “పెళ్లి తర్వాత కొత్త ప్రపంచానికి వెళ్లినట్లు అనిపించింది. ఆ సమయంలో ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే చరణ్ ది మాది విభిన్నమైన నేపథ్యాలు ఉన్న కుటుంబాలు. కానీ ఇప్పుడు అతడికి నీడలా ఉంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండడం చాలా ఆనందంగా.. అందంగా ఉంది. మేమిద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మనకు ఎల్లప్పుడు ఒక వ్యక్తి తోడు ఉండడం అవసరం. మా తాతయ్య తన కూతుర్లను ఆత్మవిశ్వాసంతో పెంచాడు. వారు కూడా తమ తండ్రి కలలకు అనుగుణంగా జీవించారు. నా జీవితంలో స్త్రీలు ఎలప్పుడు కీలకపాత్ర పోషిస్తారు. ఎందుకంటే స్త్రీ ప్రపంచం అని భావించే వాతావరణంలో నేను పుట్టాను. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాన భాగస్వామ్య శక్తులున్న నేపథ్యంలో ఇది మహిళా లోకం అనే చేప్పే సమయం వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చంది.

ఇఖ రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఉపాసన నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల తనకు గుర్తింపు రాలేదు. ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయి. పలు రంగాల్లో ఎన్నో విజయాలను అందుకుంది. కుటుంబ విలువలను గౌరవిస్తుంది. ఉపాసన తన కుటుంబ వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకువెళ్తుంది. ” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.