Upasana Konidela: ‘ఇంతకుమించి మరేమి అడగను’.. కూతురితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసిన ఉపాసన..
కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి క్లింకారా ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు చరణ్. అయితే తన కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చిరు తాతా అంటూ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెబుతున్నట్లుగా పోస్ట్ చేశారు. చరణ్ షేర్ చేసిన క్లింకారా ఫోటో నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ ఫోటో షేర్ చేసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగా ఇంట్లోకి ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఇంట ఆనంద వెల్లివిరుస్తోంది. తమ కూతురికి క్లింకారా అని పేరు పెట్టినట్లుగా గతంలో తెలిపారు రామ్ చరణ్. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి క్లింకారా ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు చరణ్. అయితే తన కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చిరు తాతా అంటూ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెబుతున్నట్లుగా పోస్ట్ చేశారు. చరణ్ షేర్ చేసిన క్లింకారా ఫోటో నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ ఫోటో షేర్ చేసింది.
తన కూతురు క్లింకారాతో కలిసి మొదటిసారి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. క్లింకారాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంతకు మించి ఇంకా అడగను. నా క్లీంకారతో కలిసి మొదటిసారి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నాను అంటూ రాసుకొచ్చింది. ఎప్పటిలాగే కూతురు ముఖం చూపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. క్లింకారా ముఖం చూపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు.




View this post on Instagram
ఇదిలాఉంటే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరోయిన్ అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈసినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. గతంలో లీక్ అయిన పిక్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచాయి.
View this post on Instagram
ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు. కూతురు జన్మించిన తర్వాత చాలాకాలం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చరణ్.. ఇటీవలే గేమ్ ఛేంజర్ సెట్ లో అడుగుపెట్టారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.