Tollywood: టాలీవుడ్ హీరో తీసిన ఫస్ట్ ఫోటో.. అందులో ఓ స్టార్ హీరో ఉన్నాడు గుర్తుపట్టగలరా ?..
ఇప్పుడు మీకోసం తెలుగు సినీ పరిశ్రమలోని ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఐదుగురిలో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు ?.. అతనెవరో గుర్తుపట్టగాలరా?. మీకోసం మరికొన్ని క్లూస్.. అతని సినిమా వస్తే థియేటర్లలో రచ్చే. ఇక పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఓవైపు ఫ్యాన్స్ ను అలరించేందుకు సినిమాలు చేస్తూనే..

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే సినీ తారల చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. వారి గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీకోసం తెలుగు సినీ పరిశ్రమలోని ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఐదుగురిలో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు ?.. అతనెవరో గుర్తుపట్టగాలరా?. మీకోసం మరికొన్ని క్లూస్.. అతని సినిమా వస్తే థియేటర్లలో రచ్చే. ఇక పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఓవైపు ఫ్యాన్స్ ను అలరించేందుకు సినిమాలు చేస్తూనే.. మరోవైపు జనం కోసం రాజకీయంలోకి వెళ్లారు. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా. అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టిన రోజు. ఈసందర్భంగా సోషల్ మీడియాలో పవన్ చైల్డ్ హుడ్ ఫోటోస్, అరుదైన పిక్చర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవన్ బర్త్ డే సెలబ్రెషన్స్ స్టార్ట్ అయ్యాయి.
మెగాస్టా్ర్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత గోకులంలో సీత సినిమాతో మరోసారి అలరించిన పవన్.. 1999లో తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డుతోపాటు.. ఆరు నంది అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత పవన్ నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలతో స్టార్ డమ్ అందుకోవడమే కాకుండా అభిమానులను పెంచుకున్నారు.
View this post on Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ ఫస్ట్ హీరో అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. మరోవైపు రాజకీయంలోనూ కొనసాగుతున్నారు.
View this post on Instagram
సాహో మూవీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఇక ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
