Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తోన్న సినిమా ఆచార్య (Acharya). ఈ మూవీని చూసేందుకు

Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..
Acharya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2022 | 12:30 PM

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తోన్న సినిమా ఆచార్య (Acharya). ఈ మూవీని చూసేందుకు మెగా అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కి్స్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఆచార్య రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాకు విడుదలకు రెండు రోజుల ముందే రివ్యూ ఇచ్చేశాడు ఉమైర్ సంధు..

ఎప్పుడూ భారీ బడ్జెట్ చిత్రాలకు.. స్టార్ హీరోస్ సినిమాలకు విడుదలకు మూడు రోజుల ముందే రివ్యూలు ఇచ్చేసి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతుంటాడు ఉమైర్ సంధు.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజీఎప్ 2 సినిమాలపై రివ్యూలు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాపై కూడా రివ్యూ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి పవర్ ప్యాక్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ తోపాటు.. మెసేజ్ ఉందంటూ నాలుగు స్టార్స్ వేశాడు.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట ట్రైలర్ గురించి కూడా రివ్యూ ఇచ్చేశాడు.. ఫుల్ మాస్ అవతారంలో మహేష్ కనిపించనున్నాడని.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమంటూ ట్వీట్ చేశాడు.. అయితే ఉమైర్ చేసిన ట్వీట్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే రివ్యూలు ఎలా ఇస్తావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..