Rashmika Mandanna: అందుకే జెర్సీ సినిమాకు నో చెప్పాను.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rashmika Mandanna: నాని (Nani) హీరోగా, గౌతమ్ తిన్ననూని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జెర్సీ (Jersy) ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు...
Rashmika Mandanna: నాని (Nani) హీరోగా, గౌతమ్ తిన్ననూని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జెర్సీ (Jersy) ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో నాని నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ పాత్రకు కూడా అదే స్థాయిలో ప్రాయారిటీ ఉంటుంది. ఈ పాత్రకు శ్రద్ధా శ్రీనాథ్ సరైన న్యాయం చేసిందని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. నిజానికి హిందీ వెర్షన్‌లో ఈ పాత్రలో తొలుత రష్మిక మందన్నను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఆమెను సంప్రదించారు కూడా. అయితే రష్మిక ఈ సినిమాలో నటించనని చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇదే ప్రశ్న రష్మికకు ఎదురైంది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై రష్మిక పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
హిందీ వెర్షన్‌లో ఆఫర్ వచ్చినా నటించకపోవడానికి గల కారణాన్ని తెలుపుతూ.. ‘జెర్సీ ఒక రియలిస్టిక్ చిత్రం. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో నటించి శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు ప్రాణం పోశారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఆ పాత్రకు నేను కరెక్ట్ కాదని అనిపించింది. నా వల్ల దర్శక, నిర్మాతలు నష్టపోకూడదనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే జెర్సీ హిందీ వెర్షన్‌కు నో చెప్పాను’ అని చెప్పుకొచ్చిందీ నేషనల్ క్రష్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Ola Electric Scooter: లక్షలు పోసి కొన్న స్కూటర్ ను తగలబెట్టిన ఓనర్.. అలా ఎందుకు చేశాడంటే..
Mango Price: ‘మామిడి’ డిమాండ్ మామూలుగా లేదుగా.. ధర తెలిస్తే వాటిజోలికెళ్లరు..! లక్షలో..
RCB vs RR Highlights: బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు.. రాణించిన అశ్విన్, కుల్దీప్‌సేన్