The Warrior: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ పోతినేని..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నాడు. రెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నాడు. రెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అక్షరా గౌడ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన బులెట్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
తెలుగు, తమిళ్ భాషలలో కలిపి ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాట 15 మిలియన్ల వ్యూస్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటలో రామ్, కృతి శెట్టి స్టెప్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
There’s no stopping this bullet! ⚡#BulletSong Clocks 15 M+ Views & Trending ??
Telugu: https://t.co/XiPpHzKO6r Tamil: https://t.co/amuQszG6Qa#TheWarriorr @ramsayz @SilambarasanTR_ @ThisIsDSP @AadhiOfficial @dirlingusamy @IamKrithiShetty @SS_Screens @adityamusic pic.twitter.com/KVHBMJanfo
— Srinivasaa Silver Screen (@SS_Screens) April 26, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..
RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..