Ola Electric Scooter: లక్షలు పోసి కొన్న స్కూటర్ ను తగలబెట్టిన ఓనర్.. అలా ఎందుకు చేశాడంటే..

Ola Electric: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు(Electric scooters) కాలిపోవటం, అమాంతం పేలిపోవటం వల్ల చాలా మంది ఈవీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.

Ola Electric Scooter: లక్షలు పోసి కొన్న స్కూటర్ ను తగలబెట్టిన ఓనర్.. అలా ఎందుకు చేశాడంటే..
Ola
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 26, 2022 | 9:59 PM

Ola Electric: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు(Electric scooters) కాలిపోవటం, అమాంతం పేలిపోవటం వల్ల చాలా మంది ఈవీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కేంద్రం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇటీవలి కాలంలో.. ఓలా స్కూటర్ తో పాటు కస్టమర్ సర్వీస్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అనేక వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీని వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల తమిళనాడులో ఓలా ఎస్-1 ప్రో(Ola S1 Pro) ఓనర్ తన స్కూటర్‌కు నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ ఘటన ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

Ola S1 ప్రో యజమాని డాక్టర్ పృథ్వీరాజ్ స్కూటర్ పనితీరు, స్కూటర్ మైలేజ్ పట్ల అసంతృప్తిగా ఉన్నందున స్కూటర్‌ను తగులబెట్టారు. సంఘటనకు మూడు నెలల ముందు అతను ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేశాడు. ఆయన స్కూటర్‌తో సమస్యలను ఎదుర్కొన్నారని వార్తా కథనాల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా.. సదరు డాక్టర్ ఇదే సమస్యపై గతంలో ఓలా ఎలక్ట్రిక్‌కు ఫిర్యాదు చేశాడు. ఓలా సపోర్టు ద్వారా స్కూటర్‌ని పరిశీలించి, మంచి వర్కింగ్ ఆర్డర్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. మైలేజ్ సరిగా లేదని ఆయన తెలిపారు. 44 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతని స్కూటర్ ఈ రోజు చెడిపోయింది. కోపంతో అతను స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ బైపాస్ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Beer prices: బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..

LIC IPO Price Band: LIC ఐపీవో అప్ డేట్.. ఒక్కో షేరు రేటు, పాలసీదారులకు డిస్కౌంట్ ఎంతంటే..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?