Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Syllabus 2022: రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తున్న సీబీఎస్సీ బోర్డు! ఆరోపణల్లో నిజమెంత..?

సిలబస్‌ను ఏయే అంశాల ప్రాతిపదికన తొలగించారు? అందుకు ఎవరిని సంప్రదించారు? ఒక టెక్ట్స్ బుక్‌ నుంచి ప్రత్యేక విభాగాన్ని తొలగించినప్పుడు, ఏ కారణం చేత తొలగించవలసి వస్తుందనే అంశంపై చర్చలు, వాదోపవాదాలు జరిపే వ్యవస్థ ఉండాలి. వ్యక్తిగత ఉద్ధేశ్యాలను నెరవేర్చుకోవడానికి ఇష్టానుసారంగా తొలగించే అధికారం ఎవరిచ్చారు?..

CBSE Syllabus 2022: రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తున్న సీబీఎస్సీ బోర్డు! ఆరోపణల్లో నిజమెంత..?
Cbse results
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 26, 2022 | 9:57 PM

CBSE dropped key chapters from History and Political Science syllabus for class 11: సీబీఎస్సీ తాజాగా 9 నుంచి 12 తరగతులకు సంబంధించిన సవరించిన సిలబస్‌ (CBSE Revised curriculum)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే 11వ తరగతి సిలబస్‌లో హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ (Political Science Subject) సబ్జెక్టుల్లో కొన్ని ముఖ్యమైన చాప్టర్లను తొలగించింది. ఎటువంటి ముందస్తు సమాచారంలేకుండా, చర్చలు కొనసాగించకుండా ఈ రెండు సబ్జెక్టుల్లో సిలబస్‌ను మార్చడం సీబీఎస్సీకి ఇది కొత్తేంకాదు. 2020లో కూడా ముందస్తు సమాచారం లేకుండానే ఫెడరలిజం (సమాఖ్యావిధానం), నేషనలిజం, సిటిజన్‌షిప్‌, సెక్యులరిజం (లౌకికవాదం) చాప్టర్లను తొలగించింది (2021లో తిరిగి సిలబస్‌లో వీటిని పునరుద్ధరించింది). ఐతే ఈ సారి డెమోక్రసీ, డైవర్సిటీ (భిన్నత్వం) టాపిక్‌లను తొలగించాలని చూస్తోంది. అలీన ఉద్యమం (non-aligned movement), ప్రచ్ఛన్నయుద్ధ కాలం (కోల్డ్‌ వార్‌ ఎరా) చాప్టర్ల నుంచి అనేక అంశాలను తొలగించడమంటే చరిత్రను విస్మరించడమే. ఎందుకంటే ఈ అంశాలను తొలగిస్తే కీలకమైన సవాళ్లు, ప్రశ్నలు ఎదురౌతాయి. ఈ విధానం ప్రాథమికంగా పాఠ్యంశాల క్రమబద్ధీకరణను దెబ్బతీస్తుంది. సాధారణీకరిస్తుంది, తక్కువ స్థాయికి దిగజారుస్తుంది. రెండో ముఖ్యవిషయం ఏమంటే.. సిలబస్‌ను ఏయే అంశాల ప్రాతిపదికన తొలగించారు? అందుకు ఎవరిని సంప్రదించారు? ఒక టెక్ట్స్ బుక్‌ నుంచి ప్రత్యేక విభాగాన్ని తొలగించినప్పుడు, క్షుణ్ణమైన పరిశీలన అత్యఅవసరం. అలాగే ఏ కారణం చేత తొలగించవలసి వస్తుందనే అంశంపై చర్చలు, వాదోపవాదాలు జరిపే వ్యవస్థ ఉండాలి. చాప్టర్‌ తొలగింపు అనేది పూర్తిగా విద్యాసంబంధమైనదై ఉండాలి. వ్యక్తిగత ఉద్ధేశ్యాలను నెరవేర్చుకోవడానికి ఇష్టానుసారంగా తొలగించే అధికారం ఎవరిచ్చారు?

కొత్త టాపిక్‌లను చేర్చడం అవసరమే అందుకు అలీన ఉద్యమం వంటి అంశాలను తొలగించడం సరికాదు ముఖ్యంగా హిస్టరీ (చరిత్ర), పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టు్ల్లోని ముఖ్యమైన సమకాలీన పరిణామాలు, కొత్త కాన్సెప్టులను చేర్చడానికి బదులుగా, అతికీలకమైన అంశాలను మినహాయిస్తున్నారు. ఈ విధమైన తొలగింపులకు ఒక పద్ధతి, విధానం ఖచ్చితంగా ఉండాలి. ఒక్క రోజులో తొలగించాలని నిర్ణయానికి రావడం సరికాదు. దీనికి చరమగీతం పాడాలి. ఏ కమిటీ ఆధ్వర్యంలో, ఎన్ని రోజులపాటు జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం పబ్లిక్‌ డొమైన్‌లో ఖచ్చితంగా పొందుపరచాలి. అన్నింటికంటే ముఖ్యంగా, పబ్లిక్ స్పేస్‌కి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?

రాజకీయ శక్తుల కుట్రలకు విద్యార్ధులను బలి చేయొద్దు.. 10, 11, 12వ తరగతి లేదా ఉన్నత విద్యలో విద్యార్ధులు పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ని వివిధ రాజకీయ దృక్కోణాల నుంచి చదువుతారు. నిజానికి జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన అలీన ఉద్యమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఐతే నేడు పండిట్ నెహ్రూ భావజాలానికి అనుకూలంగా లేని కొన్ని రాజకీయ శక్తులు ప్రతిపాదిస్తే మినహా.. అలీన ఉద్యమాన్ని తొలగించాల్సిన అవసరం దేశంలో ఎవ్వరికీ లేదు. అటువంటి వారికి మంచి సలహా ఏమిటంటే.. మీ రాజకీయలు మైదానాల్లో, స్టేజ్‌లపై చేసుకోండి. మీ జిమ్మిక్కులకు పాఠ్యపుస్తకాలను ఆట స్థలాలుగా మార్చొద్దు.

ఉద్యమం గురించి పూర్తి అవగాహన లేని విద్యార్థికి విదేశాంగ విధానం గురించి ఎలా తెలుస్తుంది? అలీన ఉద్యమం అనేది ముఖ్యమైనదా? కాదా? అనే విషయం పక్కన పెడిగే.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన విదేశాంగ విధానం ఏవిధంగా కొనసాగుతుందనే విషయం విద్యార్థులు కూలంకషంగా తెలుసుకోవాలి. అందులోని కొన్ని చాప్టర్లను తొలగిస్తే.. విద్యార్ధులకు చరిత్రపుటల్లో ఏం జరిగిందో తెలుసుకునే హక్కును కాలరాసినట్టవుతుంది. తెలుసుకునే హక్కు విద్యార్థులకు నిరాకరించినట్లవుతుంది. ఉద్యమం గురించి పూర్తి అవగాహన లేని విద్యార్థికి విదేశాంగ విధానం ఎలా తెలుస్తుంది? చూడబోతే ఇది ఎలా ఉందంటే.. సైన్స్‌ సబ్జెక్టులో కణం, దాని నిర్మాణాన్ని తెలుసుకోకుండా..DNA కాన్‌సెప్ట్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్టుంటుంది.

సిలబస్‌ తయారీ లేదా తొలగింపులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు స్కూళ్లు, కాలేజీల సిలబస్‌ను రూపొందించడంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఈ విషయాన్ని ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికే వదిలెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా పాఠ్యపుస్తకాల సిలబస్ రూపకల్పన (ఉన్నత విద్య కోసం) యూనివర్సిటీ ఎక్స్‌పర్ట్స్‌ చేస్తున్నారే తప్ప.. నియంత్రిత అధికారాల ద్వారా మాత్రం కానేకాదు. ఇందుకు విరుద్ధంగా మనదేశంలో అన్ని రకాల సిలబస్‌ల రాత కోతల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రెగ్యులేటరీ బాడీ ఏవిధంగా అత్యుత్సాహం చూపిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇది ఆరోగ్యకరమైన విద్యావిధానానికి గొడ్డలిపెట్టు వంటిది. సిలబస్‌లలో మార్పులు, చేర్పులు యూనివర్సిటీ నిపుణులు చేయాలేతప్పితే.. మరెవ్వరూ జోక్యం చేసుకోకూడదు. మరీ ముఖ్యంగా అధికారులు, రాజకీయ నాయకులు ఈ విధానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఈ చర్చ సారాంశం ఇదే.. ఆయా సబ్జెక్టుల నుంచి సంబంధిత టాపిక్‌లను తొలగించవల్సి వస్తే కొన్ని ఒడిదుడుకులు ఎదురౌతాయి. ఉదాహరణకు విద్యార్ధి పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుపై ఆసక్తి కోల్పోవడం లేదా ఆ స్పెషలైజేషన్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి విముఖత చూపే అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టు కనుమరుగైపోతుంది.

టాపర్లందరి చూపు పొలిటికల్‌ సైన్స్‌ పైనే.. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో టాపర్లందరూ మొదటి ఎంపికగా పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టును ఎన్నుకుంటున్నారు. ఐతే కొన్నెళ్లు పోయాక పొలిటికల్‌ సైన్స్‌కు ఉన్న ఈ రాజయోగం తగ్గి పరిస్థితి తలకిందులవ్వొచ్చు. ఎందుకంటే 10, 11, 12 తరగతుల్లోనే విద్యార్థులకు అభిరుచి ఏర్పడుతుంది. పాఠశాల స్థాయిలోనే సబ్జెక్టులో కోతలు విధిస్తే.. దాని ప్రభావం యూనివర్సిటీ విద్యపై ఖచ్చితంగా పడుతుంది.

నేటి యువతలో డిబేట్‌ కల్చర్‌ పెంపుకు ఆస్కారమున్న అంశాలను.. ఇటు వంటి చర్యల ద్వారా అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. దాని స్థానంలో అవకాశ వాదుల భావజాలాలను, ఉన్మాద రాజకీయాలను భర్తీ చేయాలని చూస్తున్నారు. పాఠశాల స్థాయిలో హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులపై కోతలు విధిస్తే.. సోషల్‌ సైన్సెస్‌ ఉద్దేశ్యాన్ని, ఆలోచనాత్మక సరళిని నాశనం చేసినవారమౌతాం. అందుకే సిలబస్‌ కోత సంస్కృతికి వెంటనే స్వస్తి పలకాలి.

– తన్వీర్‌ ఐజాజ్‌

Also Read:

ECIL Hyderabad Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగావకాశాలు.. అర్హతలివే!